తెలుగులో మహేష్ బాబు, నాగ చైతన్య తో నటించిన కృతి సనన్ కి సౌత్ అంత హిట్ ఇవ్వలేదు. తర్వాత కృతి సనన్ బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ సక్సెస్ అవుతున్న తరుణంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ లో జానకి గా ఛాన్స్ వచ్చింది. ఒక్కసారిగా కృతి సనన్ ఫెమస్ అయ్యింది. సౌత్ లోని అందరి చూపు కృతి సనన్ పై పడింది. అందరిలో హాట్ టాపిక్ అయిన కృతి సనన్ అప్పుడప్పుడు ప్రత్యేక ఇంటర్వూస్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన స్వయంవరం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను గనక స్వయంవరం పెడితే అందులో ముగ్గురు హీరోలు తప్పకుండా ఉండాలంటుంది. వారెవరో కాదు ప్రస్తుతం లైగర్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ, కార్తీక్ ఆర్యన్ ఇంకా ఆదిత్య రాయ్ కపూర్ లు తన స్వయంవరంలో ఉండాలంటుంది.
విజయ్ దేవరకొండ లుక్స్ చాలా బావుంటాయని, అలాగే అతని స్టైల్, మాట్లాడే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా ఇంటర్వ్యూలలో నేను గమనించాను. విజయ్ దేవరకొండ ఆ ఇంటర్వూస్ లో చాలా రియల్ గా తనకు నచ్చినట్లుగా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా అతనిలో మంచి సున్నితత్వం కూడా ఉంది. అలాంటి వ్యక్తి స్వయంవరంలో ఉంటే బావుంటుంది అంటూ చెప్పింది. ఇక కార్తీక్ ఆర్యన్, ఆదిత్య కపూర్ లు మాట్లాడే విధానం బావుంటుంది అంటూ సన్సేషనల్ గా మాట్లాడింది.