సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ఒక్క ట్వీట్ చేసినా.. లేదంటే ఒక్క పిక్ షేర్ చేసిన అభిమానులు దానిని తెగ షేర్ చెయ్యడం, లైక్స్ కొడుతూ ట్రెండ్ చేస్తూ ఉంటారు. దానితో సెలబ్రిటీస్ కి లక్షల్లో మిలియన్స్ ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఇక్కడ సినిమాల విషయంలోనూ, పారితోషకం విషయంలోనూ పోటీపడినట్లుగా.. సోషల్ మీడియా లో ఫాలోవర్స్ విషయంలోనూ, ఫాన్స్ విషయంలోనూ పోటీపడుతున్నారు. వీళ్ళు ఒక్క ట్వీట్ వెయ్యగానే అభిమానులు ఎగబడిపోయి షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉందొ ఓ సర్వే నిర్వహించారు.
అందులో ట్విట్టర్ హ్యాండిల్ లో మహేష్ బాబు టాలీవుడ్ నుండి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆయన ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య 12.7 మిలియన్స్ కు చేరుకుంది. ఆ తర్వాత స్థానంలో అల్లు అర్జున్ ఉండగా.. రానా మూడో స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. ఇక ఇన్స్టాగ్రామ్ లో అందరికి కన్నా టాప్ లో అల్లు అర్జున్ 18.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ 16.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నాడు. ఇక మూడో ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ ఉన్నాడు. ఇక ఫేస్ బుక్ లో మాత్రం ప్రభాస్ నెంబర్ వన్. ప్రభాస్ గనక ట్విట్టర్, ఇన్స్టా లో ఉంది ఉంటే గనక ఆయనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉండేవాడు. ఆయన కేవలం ఫేస్ బుక్ లో మాత్రమే ఉన్నాడు.