Advertisementt

ఇష్టం లేదు.. కానీ: ఐటం‌సాంగ్స్‌పై ఇంద్రజ

Fri 19th Aug 2022 06:03 PM
indraja,item songs,special songs,tollywood,actress indraja,indraja about special songs  ఇష్టం లేదు.. కానీ: ఐటం‌సాంగ్స్‌పై ఇంద్రజ
Actress Indraja Sensational comments on Item songs ఇష్టం లేదు.. కానీ: ఐటం‌సాంగ్స్‌పై ఇంద్రజ
Advertisement
Ads by CJ

ఐటం సాంగ్స్.. మనోళ్లు ముద్దుగా స్పెషల్ సాంగ్స్ అని పిలుచుకుంటూ ఉంటారు కదా.. ఆ సాంగ్స్‌పై సీనియర్ నటి ఇంద్రజ తన తాజా ఇంటర్వ్యూలో హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా తను ఈ స్పెషల్ సాంగ్స్‌లో ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా చాలా క్లారిటీగా సెలవిచ్చింది. ఒకప్పుడు ఈ స్పెషల్ సాంగ్స్ ‌విషయంలో జ్యోతి లక్ష్మీ, జయమాలిని వంటివారు చాలా ఫేమస్. హీరో ఎవరైనా సరే.. వీరిద్దరూ తమ ఊపులతో అప్పట్లో జనాల్ని థియేటర్లకి రప్పించేవారు. ఆ తర్వాత సిల్క్‌స్మిత, ముమైత్ ఖాన్ వంటి వారు ఆ లెగసీని కంటిన్యూ చేశారు. ప్రజంట్ విషయానికి వస్తే.. హీరోయిన్లే ఈ స్పెషల్ రోల్ కూడా తీసుకుంటున్నారు. కాజల్, తమన్నా, సమంత వంటి వారు కూడా స్పెషల్‌కి సై అంటోన్న రోజులివి. అయితే హీరోయిన్లే.. స్పెషల్ సాంగ్ చేయడానికి ఓ కారణం ఉందంటూ తాజాగా ఇంద్రజ సంచలన విషయాలను రివీల్ చేసింది. 

 

‘‘హీరోయిన్లు అంత సామాన్యంగా స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించరు. నేను కూడా నాగార్జునగారి సినిమాలో ‘కన్నెపెట్టరో’ అనే సాంగ్ చేశాను. తమిళ్‌లో కూడా ఓ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో చేశాను. అయితే మాలాంటి వారు హీరోయిన్లుగా చేసేటప్పుడు.. ఇటువంటి స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఓ కారణం ఉంది. ఎందుకు మేము అలాంటి సాంగ్స్ చేయాల్సి వచ్చేదంటే.. పెద్ద బ్యానర్, పెద్ద నిర్మాతలు అడిగినప్పుడు కాదని అనలేం. వారి రిక్వెస్ట్‌ని ఎలా కాదని అనగలం. అందుకే ఇష్టం లేకపోయినా.. స్పెషల్ సాంగ్స్ చేయాల్సి వచ్చేది. ఇంకా లోతుగా ఈ విషయంపై చర్చిస్తే.. ఇప్పుడు కాంట్రవర్సీలు అవుతాయి. అలాగే ఇప్పటి హీరోయిన్లు చేస్తున్న స్పెషల్ సాంగ్స్ గురించి కూడా.. ఈ టైమ్‌లో మాట్లాడకుండా ఉండటమే బెటర్..’’ అని ఇంద్రజ చెప్పుకొచ్చింది.

Actress Indraja Sensational comments on Item songs:

Indraja Talks about Special songs in Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ