ప్రభాస్ తో సినిమా చెయ్యాలనే కోరిక ప్రతి ఒక్క నిర్మాతకి ఉంటుంది. ఎందుకంటే క్రేజీ స్టార్, పాన్ ఇండియా స్టార్ అయిన ఆయనతో సినిమా చెయ్యాలని ఎవరికుండదు చెప్పండి. కానీ ఇప్పుడొక నిర్మాత మాత్రం ప్రభాస్ తో సినిమా చెయ్యాలంటే వెనక్కి తగ్గుతున్నాడట. అందులోనూ ప్రభాస్ కి అడ్వాన్స్ ఇచ్చాకే ఆయన ఇప్పుడు ఈ సినిమా ని చెయ్యలేను అని చెబుతున్నట్లుగా తెలుస్తుంది. అదేదో పాన్ ఇండియా మూవీ కాదు అది మారుతితో ప్రభాస్ చెయ్యబోయే సినిమా. ఈ సినిమాని ట్రిపుల్ ఆర్ నిర్మాత దానయ్య నిర్మించానుకున్నారు. ఎప్పుడో ప్రభాస్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారట. కానీ ఇప్పుడు దానయ్య ఆ సినిమా చెయ్యాలనుకోవడం లేదట. కారణం ఆ ప్రాజెక్ట్ ఇంకా ఇంకా లేట్ అవడమేనట.
ప్రభాస్ మారుతీ తో సినిమా చెయ్యడానికి కమిట్ అయినట్లుగా మారుతీ నే చెప్పాడు. ఆ సినిమాకి టైటిల్ గా రాజా డీలక్స్ అని పెట్టారని, ఇందులో ముగ్గురు హీరియిన్స్ కూడా ఉండబోతున్నట్లుగా ప్రచారం జరగడమే కాదు, మారుతీ కూడా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసారని అన్నారు. కానీ పక్కా కమర్షియల్ హిట్ కాకపోవడంతో మారుతి - ప్రభాస్ సినిమా లేట్ అవుతూ వస్తుంది. దానితో దానయ్య ఈ సినిమాని వదిలేసే ఉద్దేశ్యంలో ఉండి ప్రభాస్ కిచ్చిన అడ్వాన్స్ వచ్చినా చాలానే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే దానయ్య ప్లేస్ లోకి ఎవరో ఒక నిర్మాత రావాల్సిందే.