తానేదో డేట్ ని అడ్జెస్ట్ చేసుకోమని నిఖిల్ ని కార్తికేయ 2 మేకర్స్ ని ఇబ్బంది పెట్టినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు, నేను జులై 8 న నా థాంక్యూ మూవీ ని విడుదల చేద్దామనుకుని.. కొన్ని కారణాల వలన జులై 22 కి మార్చాలనుకుని కార్తికేయ 2 మేకర్స్ లో ఒకరైన వివేక్ ని అడిగాను. తర్వాత నిఖిల్, చందు నా దగ్గరకి వచ్చి మా కార్తికేయ డేట్ మార్చుకుంటామన్నారు. ఆ తర్వాత ఆగస్టు 12 న విడుదల చేద్దామంటే వేరే సినిమాలు రిలీజ్ అవుతున్నాయని అనగా.. ఒకరోజు ముందో, వెనకో రిలీజ్ చెయ్యమని నేనే సలహా ఇచ్చాను. కానీ నేనేదో కార్తికేయ సినిమా విడుదల కాకుండా అడ్డుపడినట్లుగా రాసారు. ఇలాంటివి రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ కార్తికేయ 2 ప్రెస్ మీట్ లో దిల్ రాజు ఎమోషనల్ గా మట్లాడారు..
ఓకె దిల్ రాజు మాట్లాడింది అంతా నిజమే. కానీ నిఖిల్ కార్తికేయ 2 రిలీజ్ ప్రమోషన్స్ లో నేను కార్తికేయ 2 ని రిలీజ్ డేట్ కోసం చాలా ఇబ్బందుకు పడ్డాను, నీ సినిమా ఎలా విడుదల చేస్తావో చూస్తామంటూ బెదిరింపులు వచ్చాయి, నేను హ్యాపీ డేస్ అప్పటినుండి ఇప్పటివరకు సినిమా విడుదల తేదీల విషయంలో ఇబ్బందులు పడలేదు. కానీ కార్తికేయ 2 కి మాత్రం సమస్యలు ఎదుర్కొన్నాను అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. మరి దిల్ రాజు మాట్లాడిన దానికి, నిఖిల్ చెప్పిన దానికి ఎక్కడా పొంతన లేదు. అదే విషయం నెటిజెన్స్ కూడా అడుగుతున్నారు. మరి నిఖిల్ ఎవరినుండి ప్రోబ్లెంస్ ఫేస్ చేసాడు అని.