Advertisementt

లైగర్ పారితోషకం లెక్కలు

Tue 16th Aug 2022 02:00 PM
liger movie,vijay deverakonda,ananya panday,puri jagannath  లైగర్ పారితోషకం లెక్కలు
Stars Remuneration for Liger లైగర్ పారితోషకం లెక్కలు
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ కి అడ్వాన్స్ కింద పూరి జగన్నాధ్ 2 కోట్లు పంపిస్తే.. ముందు అప్పులు తీర్చుకోమని, తర్వాత పారితోషకం సంగతి చూద్దామని విజయ్ దేవరకొండ తనకి చెప్పడంతో అతనిది చాలా మంచి హృదయం అంటూ పూరి లైగర్ వరంగల్ ఈవెంట్ లో చెప్పారు. లైగర్ మూవీ మూవీ చెయ్యడం నిర్మాతగా ఛార్మి దొరకడం తన అదృష్టమంటూ విజయ్ కూడా అదే ఈవెంట్ లో చెప్పాడు. అయితే తాజాగా లైగర్ సినిమాకి హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే, అలాగే బాక్సర్ మైక్ టైసన్ కి అందుకున్న పారితోషకాల లెక్కలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

లైగర్ పాన్ ఇండియా మూవీ కావడంతో దాని క్రేజ్ ని బట్టి విజయ్ దేవరకొండ దాదాపు 30 కోట్లు పారితోషకం కింద మాట్లాడుకున్నారట. సినిమా రిలీజ్ అయ్యాక లాభాలు వస్తే మరికొంత అప్పజెబుతామంటూ పూరి మాట కూడా ఇచ్చారట. ఇక బాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనన్య పాండే కి కేవలం మూడు కోట్లు ముట్టజెప్పినట్లుగా తెలుస్తుంది. మరోపక్క ఈ సినిమాలో కీలకమైన మైక్‌ టైసన్‌కు మాత్రం హీరో విజయ్‌ దేవరకొండ కంటే ఎక్కువగా సుమారు 40కోట్ల వరకు రెమ్యునరేషన్‌ అందించినట్లు సమాచారం. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్‌ స్టార్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్రలో కనిపించనుండడంతో ఆయన క్రేజ్ ని బట్టి పారితోషకం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది.

Stars Remuneration for Liger:

Vijay Deverakonda Remuneration for Liger

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ