ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోల భార్యలు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న సెలబ్రిటీస్, అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య మాత్రమే లో ప్రొఫైల్ మెయింటింగ్ చేసే అమ్మాయి. మహేష్ భార్య నమ్రత, అల్లు అర్జున్ భార్య స్నేహ, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన వీళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో ఫోకస్ అవుతూనే ఉంటారు. అయితే అల్లు అర్జున్ వైఫ్ స్నేహ మాత్రం తరచూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. కారణం స్నేహ రెడ్డి గ్లామర్ ఫోటో షూట్స్. హీరోయిన్స్ అందానికి, ఫిజిక్ కి ఏ మాత్రం తీసిపోని గ్లామర్ స్నేహ ది.
అల్లు అర్జున్ తో పార్టీలకి వెళ్లినా స్నేహ రెడ్డి మాత్రం హీరోయిన్స్ లా గ్లామర్ గా రెడీ అయ్యి అందరి చూపు తన మీదే ఉండేలా చూసుకుంటుంది. అందులోనూ ఈమధ్యన సోలో ఫోటో షూట్ అంటూ అందాల ఆరబోతకు దిగింది. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ వైఫ్ మీరా రాజపుట్ కూడా హీరోయిన్ కాకపోయినా.. ఆమె కూడా హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేంత అందంగా గ్లామర్ గా ఉంటుంది. అదే రేంజ్ లో ఇప్పుడు స్నేహ రెడ్డి కనిపిస్తుంది. ఇద్దరి పిల్లలకి తల్లయినా అందం ఏ మాత్రం తగ్గని స్నేహ రెడ్డి ఇప్పుడు ఇలా అందాలని చూపిస్తూ గ్లామర్ గా ఫోటో షూట్స్ చేయించుకుంటుంటే.. ఏమ్మా స్నేహ ఎమన్నా హీరోయిన్ అవకాశాల కోసం ట్రై చేస్తున్నావా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.