నితిన్ కి భీష్మ తర్వాత అంత పెద్ద హిట్ దక్కలేదనే చెప్పాలి. భీష్మ తర్వాత చేసిన చెక్ మూవీ విమర్శలు ప్రశంశలు అందుకున్నా.. ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత నితిన్ నటించిన బాలీవుడ్ అంధాదున్ రీమేక్ అయిన మ్యాస్ట్రో ఓటిటిలో రిలీజ్ అయ్యింది. ఇక తాజాగా నితిన్ నుండి మాస్ జాతర అంటూ మాచర్ల నియోజక వర్గం రాగా..ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కె డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆడియన్స్, క్రిటిక్స్ ఇలా అందరూ మాచర్ల నియోజకవర్గానికి నెగటివ్ టాక్ స్ప్రెడ్ చెయ్యడంతో నితిన్ కెరీర్ లో ఈ సినిమా డిసాస్టర్ గానే నిలిచింది. అయితే ఫస్ట్ డే ఈ సినిమా ఓపెనింగ్స్ లో పర్వాలేదనిపించింది.
కానీ రెండో రోజుకే మాచర్ల కలెక్షన్స్ పడిపోయాయి. అందులోనూ మాచర్ల నియోజక వర్గం విడుదలైన రెండో రోజు కార్తికేయ 2 రావడం, నిఖిల్ - చందు మొండేటి కార్తికేయ 2 కి సక్సెస్ టాక్ రావడం తో మాచర్ల కలెక్షన్స్ మూడో రోజు మరింతగా దిగజారాయి. డిజాస్టర్ అన్న మాచర్ల నియోజక వర్గం సినిమాకి కలెక్షన్స్ బావున్నాయి అనడం, మాచర్ల కి డిసాస్టర్ టాక్ వచ్చాకే.. సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ అక్క, తండ్రితో కలిసి నితిన్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక మాచర్ల నియోజకవర్గం కలెక్షన్స్ కూడా ఫేక్ కలెక్షన్స్.. అందులో ఏ ఒక్కటి నిజం లేదు అంటున్నారు. ఫైనల్ గా వారం గడవకముందే నితిన్ మాచర్ల నియోజకవర్గం డిసాస్టర్ గా తేల్చేసారు ట్రేడ్ నిపుణులు.