Advertisementt

చిరు స్లిమ్ లుక్ వైరల్

Tue 16th Aug 2022 11:26 AM
megastar chiranjeevi,chiranjeevi super slim look,chiru new look  చిరు స్లిమ్ లుక్ వైరల్
Megastar looks Fit and Super slim చిరు స్లిమ్ లుక్ వైరల్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆయన బర్త్ డే ప్లాన్ లో బిజీగా వున్నారు. వచ్చే సోమవారం ఆగష్టు 22 న జరగబోయే ఆయన బర్త్ డే కి లుక్స్ కానీ అప్ డేట్స్ ఇచ్చేందుకు ఆయనతో సినిమాలు చేస్తున్న మేకర్స్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ షూటింగ్స్ ఆగిపోవడంతో చిరు కూల్ గా రిలాక్స్డ్ మోడ్ లో ఉన్నారు. అయితే ఈ మధ్యన చిరు లుక్ విషయంలో విమర్శలు ఎక్కువయ్యాయి. లుక్ విషయంలో ఇబ్బందులు పడే బాలయ్య సూపర్ స్టయిల్ గా తయారవుతుంటే.. స్టైలిష్ చిరు మాత్రం లుక్ విషయంలో విమర్శల పాలవడం ఆయన ఫాన్స్ కి మింగుడుపడడం లేదు. 

అయితే మొన్నామధ్యన అంటే ఆచార్య రిలీజ్ టైం లో చిరు బరువు తగ్గేందుకు అమెరికా వెళ్లారని ప్రచారం జరిగింది. కానీ అమెరికా నుండి వచ్చాక కూడా చిరు అదే బరువుతో కనిపించారు. రీసెంట్ గా ఆగష్టు 15 న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన చిరు బాగా సన్నబడి స్లిమ్ గా కనిపించారు. ఫేస్ లో బరువు తగ్గకపోయినా.. బాడీ లో కొవ్వు కరించారు. చాలా ఫిట్ నెస్ తో కనిపించిన చిరు లుక్ కి మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఫేస్ లో కూడా గ్లో కనిపిస్తే.. చిరు లుక్ ని తలతన్నేవారే ఉండరు అంటున్నారు వారు.

Megastar looks Fit and Super slim:

Megastar Chiranjeevi looks Fit and Super slim

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ