ప్రస్తుతం టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ జరుగుతుంది. ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. హీరోలు రిలాక్స్ అవుతున్నారు, మరోపక్క కాస్త కినుకుగాను ఉన్నారు. సమయం గడిచిపోతుంది అంటూ ఫీలవుతున్నారు. దసరాకు రాబోయే సినిమాల షూటింగ్స్ అన్ని చివరి దశలో ఉన్నాయి. ఆగష్టు 1 నుండి ఆగిపోయిన షూటింగ్స్ లో బాలయ్య బాబు నటిస్తున్న NBK107 కూడా ఉంది. గోపీచంద్ మలినేని - బాలకృష్ణ కలయికలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఆగింది. ఇదంతా లేకపోతే బాలయ్య కర్నూల్ షెడ్యూల్ పూర్తి చేసుకుని విదేశాలకు నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెళ్లాల్సి ఉంది.
అమెరికా వెళ్లాల్సిన యూనిట్ కి కొంతమందికి వీసా ప్రోబ్లెంస్ ఉండడంతో ఆ షెడ్యూల్ టర్కీలో ప్లాన్ చేసారు. అయితే ఈ నెల 24 న బాలయ్య అండ్ NBK107 టీం టర్కీ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఓ కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకోనుంది అని సమాచారం. ఈ టర్కీ షెడ్యూల్ లో హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొనబోతుంది అని, అలాగే ఓ సాంగ్ చిత్రీకరణతో పాటు కీలక యాక్షన్ సన్నివేశాలని ని టర్కీ లొకేషన్స్ లో చిత్రీకరించబోతున్నట్టుగా చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం.