పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు అదే పూరి డైరెక్షన్ లో బిజినెస్ మ్యాన్ చేసారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి పూరి జగన్నాధ్ మహేష్ బాబు దగ్గరకి వెళ్లి తన డ్రీం ప్రాజెక్ట్ జన గణ మన స్క్రిప్ట్ వినిపించగా.. కొన్నాళ్ళు మహేష్ ఆ స్క్రిప్ట్ మీద సుముఖంగానే ఉన్నప్పటికీ.. తర్వాత అది కార్య రూపం దాల్చలేదు. ఆ తర్వాత అదే స్క్రిప్ట్ పూరి చాలామందికి వినిపించినా.. ఎవరూ ఆ ప్రాజెక్ట్ చెయ్యడానికి ముందుకు రాలేదు. కానీ పూరి దర్శకత్వంలో లైగర్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నా విజయ్ దేవరకొండ లైగర్ విడుదల కాకుండానే పూరి తో జన గణ మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు.
ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసారు విజయ్ దేవరకొండ - పూరి లు. అయితే తాజాగా లైగర్ మీడియా మీట్ లో విజయ్ దేవరకొండ ఈ జన గణ మన ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. మహేష్ బాబు అంటే ఇష్టమని, ఆయన నటించిన పోకిరి నాకు ఇష్టమైన సినిమా. అలాగే మహేష్ బాబు చెయ్యలేనిది.. నేను చెయ్యగలుగుతున్నా అంటూ విజయ్ దేవరకొండ జన గణ మన మహేష్ చెయ్యకపోవడం, అదే ప్రాజెక్ట్ తాను చెయ్యడం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.