ఈ ఇయర్ రిలీజ్ అయిన రాధే శ్యామ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రభాస్ రాబోతున్న సినిమాలపై అంచనాలను మరింత పెంచుకుని ప్రభాస్ కటౌట్ కి తగ్గ కమర్షియల్ సినిమా పడితే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రూవ్ చేస్తామంటూ ఉత్సాహాన్ని చూపుతున్న ప్రభాస్ అభిమానులు, ప్రభాస్ చిత్రాల అప్ డేట్స్ కోసం ఆయా చిత్రాల మేకర్స్ ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తున్నారు. ఈ మేరకు అభిమానుల తాకిడి తట్టుకోలేక సలార్ నుంచి రిలీజ్ డేట్ కన్ ఫమ్ చేస్తూ ప్రకటన వెలువడింది.
2023 జనవరి 12 న ఆదిపురుష్ గా రాబోతున్న ప్రభాస్ సెప్టెంబర్ 28 న సలార్ ఫస్ట్ పార్ట్ తో రాబోతున్నాడు. మేకర్స్ సలార్ 2 పార్ట్స్ అని చెప్పకపోయినప్పటికీ.. సినీజోష్ కి అందిన సమాచారం మేరకు సలార్ రెండు భాగాలుగా వస్తుంది అనేది ఖచ్చితమైన విషయం. ఇక తన రెండు చిత్రాలు కెజిఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 లని ఒకదాన్ని మించి మరొకటి తీర్చిదిద్దిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ స్ట్రెంత్ కి, స్టార్ డమ్ కి, ఇమేజ్ కి సరి తూగే కథతో సలార్ ని రూపొందించడం, ఈ చిత్రం పై రోజు రోజుకి అంచనాలను పెంచుతుంది. ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్ చేతిలో ప్రభాస్ ఉన్నాడు కనక చాలా ధీమాగా ఉన్నారు రెబల్ స్టార్ ఫాన్స్. హీరోయిజం ని ఆకాశమే హద్దు అన్న రీతిలో చూపించే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సలార్ ఖచ్చితంగా ఫాన్స్ కే కాదు, ఆడియన్స్ కి కూడా ఐఫీస్ట్ లా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు.