Advertisementt

డేట్ సెంటిమెంట్ తో వస్తున్న నాగ్

Mon 15th Aug 2022 10:37 AM
nagarjuna,ghost movie,shiva movie  డేట్ సెంటిమెంట్ తో వస్తున్న నాగ్
Nag coming with date sentiment డేట్ సెంటిమెంట్ తో వస్తున్న నాగ్
Advertisement
Ads by CJ

నాగార్జున కి కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా, ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం శివ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున సైకిల్ చైన్ తిప్పుతూ రఫ్ ఆడించిన ఆ సినిమా నాగ్ కెరీర్ కి ముందు నాగ్ కెరీర్ కి వెనుక అని మాట్లాడుకునేలా చెయ్యడమే కాదు, ఆ తర్వాత అదే థీమ్ తో బోలెడన్ని సినిమాలు తెరకెక్కాయి. నాగార్జున ని మాస్ గా చూపించిన ఆ సినిమా ఆయన కెరీర్ లో ఎప్పుడూ టాప్ లిస్ట్ లోనే ఉంటుంది. ఆ సినిమా అక్టోబర్ 5 న రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే డేట్ సెంటిమెంట్ తో నాగార్జున ఘోస్ట్ రిలీజ్ చెయ్యబోతున్నారు. 

గత ఏడాది వైల్డ్ డాగ్ తో పర్వాలేదనిపించిన నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు తో భారీ హిట్ కొట్టినా.. ఆ సక్సెస్ ని కొడుకు నాగ చైతన్య తో షేర్ చేసుకున్నారు. కొన్నాళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న నాగార్జున ఘోస్ట్ పై చాలా నమ్మకంతో ఉన్నారు. అక్టోబర్ 5 దసరా స్పెషల్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, గ్లిమ్ప్స్ అన్ని అంచనాలు పెంచేవిలా ఉన్నాయి. అటు ఫిట్ నెస్ విషయంలో, ఇటు లుక్స్ విషయంలో నాగార్జున కూల్ గా కనిపిస్తున్నారు. మరి అక్టోబర్ 5 డేట్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఘోస్ట్ కూడా శివ అంత బ్లాక్ బస్టర్ అవ్వాలని అక్కినేని ఫాన్స్ కూడా కోరుకుంటున్నారు.

Nag coming with date sentiment:

Nagarjuna Ghost releasing on October 5th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ