తనకి బుల్లితెర మీద మంచి పాపులారిటీ తీసుకొచ్చిన జబర్దస్త్ షో ని అనసూయ మొన్నీమధ్యనే వదిలి బయటికి వచ్చేసింది. అసలు అనసూయ ఆ షో వదిలెయ్యడానికి ఆమెకి సినిమాలలో ఆఫర్స్ రావడమే కారణమంటూ అనసూయ చెప్పడమే కాదు, ఇంకా కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ కూడా చెప్పారు. కానీ షో కి టీఆర్పీ పడిపోవడం, నాగబాబు, రోజా లేకపోవడంతో తాను ఆ షో లో ఉండలేక జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది అనే న్యూస్ కూడా చక్కర్లు కొట్టింది. ఆర్పీ లాంటి వాళ్ళు అనసూయ అక్కడ అవమానాలు భరించలేకే బయటికి వచ్చింది అన్నారు.
ఫైనల్లీ జబర్దస్త్ ని అనసూయ వదిలెయ్యడానికి అసలు కారణం చెప్పి షాకిచ్చింది. జబర్దస్త్ షో నుండి బయటికి రావడానికి కారణం తనపై వేసే పంచ్ లని భరించలేకపోతున్నాను అని, పంచులు నచ్చక తాను ముఖం మాడ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నప్పటికీ, అవేమి షో లో కనిపించేవి కాదని, అంతేకాకుండా తనకు బాడీ షేమింగ్ చేసే వారన్నా, వెకిలి చేష్టలు చేసేవారన్నా నచ్చదని చెప్పిన ఆమె.. క్రియేటివ్ ఫీల్డ్ అన్న తర్వాత ఇలాంటివి తప్పదని నిట్టూర్చింది. కానీ ఎప్పటికీ ఇదే ఊబిలో చిక్కుకుపోవాలని తాను అనుకోవడం లేదని.. అందుకే జబర్దస్త్ నుండి బయటికి వచ్చాను అని చెప్పింది.
రోజగారు, నాగబాబు గారు వెళ్ళిపోయినందుకు నేను షో మానెయ్యలేదు అని, రెండేళ్లుగా జబర్దస్త్ ని వదిలేయాలని అనుకుంటున్నాను, కానీ కుదరలేదు అని ఇప్పుడు సినిమాలతో బిజీగా మారడం వలన షో కి టైం కేటాయించలేకపోతున్నట్టుగా.. అసలు నిజాలు బయటపెట్టింది అనసూయ.