హిట్ మూవీ కార్తికేయకి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 రీసెంట్ గా పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి క్రిటిక్స్ నుండి ఫుల్ సపోర్ట్ దొరికింది. అలాగే ఆడియన్స్ కూడా సినిమా బాగుంది అంటూ మౌత్ టాక్ తో సినిమాకి హైప్ క్రియేట్ చేస్తున్నారు. కంటెంట్ బావుంది, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోవడం, సినిమాటోగ్రఫీ కళ్ళకు ఇంపుగా ఉండడం, దర్శకత్వం, నిఖిల్ నటన, కథ అన్ని కార్తికేయ హిట్ లో భాగమయ్యాయి. అయితే కార్తికేయ 2 హిందీలో కూడా రిలీజ్ అయ్యింది.
నిన్న శనివారం ముంబైలో 8 థియేటర్స్ లో మొదలయ్యింది కార్తికేయ 2. సాయంత్రానికి 20 షోస్ పెరిగాయి. ఈ రోజు సండే ఇంకాస్త ఇంక్రీజ్ అయ్యి 50 థియేటర్స్ కి పెరిగింది. బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ మూవీస్ ని డామినేట్ చేసి మరీ కార్తికేయ 2 కి థియేటర్స్ సందడి చేస్తుంది అంటే అక్కడి ప్రేక్షకుల ఆదరణ, మౌత్ టాక్ స్పందన కార్తికేయ2 కి ఎంత ఉందో అర్ధమవుతుంది. హిందీ సినిమాలకంటే.. కార్తికేయ కే షోస్ ఫుల్ అవుతుండడం, పైగా ఆక్యుపెన్సీ కూడా వాటికన్నా దీనికే ఎక్కువవడం చూసి ట్రేడ్ వర్గాల వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. కరెక్ట్ కంటెంట్ పడితే ఆ సినిమాలకు ప్రేక్షకాదరణ ఎంతగా ఉంటుందో.. కార్తికేయ 2 హిందీ రెస్పాన్స్ మరో ఉదాహరణ.