గత కొన్ని రోజులుగా సినిమాల విషయంలో బండ్ల గణేష్ చేస్తున్న ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడం కాదు, కొంతమందికి అవి సెటేరికల్ గా గుచ్చుకునేలా ఉంటున్నాయి. తాజాగా థియేటర్స్ vs ఓటిటీస్, ప్రేక్షకులు థియేటర్ లకి రావడం లేదు అంటూ సినీ ప్రముఖులు నెత్తినోరు కొట్టుకుంటున్న విషయమై బండ్ల గణేష్ ఎప్పటిలాగే కాస్త సెటేరికల్ కామెంట్స్ తో చేసిన వీడియో హాట్ టాపిక్ గా మారింది. సినిమా అంటే నాకిష్టం, నేను సినిమాల కోసమే బ్రతుకుతున్నాను, ఈ మధ్యన సినిమాలు ఆడడం లేదు.. జనాలు థియేటర్స్ కి రావడం, లేదు అని గోలగోల చేస్తూ గగ్గోలు పెడుతున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి.. పరభాషా హీరో అయిన దుల్కర్ ఇక్కడికి వచ్చి హిట్ కొట్టాడు. మిడిల్ రేంజ్ హీరో కళ్యాణ్ రామ్, చిన్న హీరో నిఖిల్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అద్భుతమైన కథా, కథనంతో తెరకెక్కిస్తే, ఎప్పుడైనా అలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.. ఆనందిస్తారు.. ఆస్వాదిస్తారు. మనం బడ్జెట్ పెంచేసి.. వందల కోట్లు, వేల కోట్లతో సినిమా తీసి, వంద కార్లు ఎగిరాయి.. వంద టైర్లు పగిలాయి.. చేతిలో హీరో ఓ రాడ్ పట్టుకుని వెనుక ఓ వంద మందిని పెట్టుకుని భమ్ అని లేపితే జనాలు వస్తారునుకోవడం తప్పు. హార్ట్ ని టచ్ చేసే సినిమాలు, జనాలను సీట్లలో అతుక్కునేలా చేసే సినిమాలు చేస్తే మనకి తిరుగు ఉండదు. ఇలా షూటింగ్స్ బంద్, టికెట్ రేట్స్ తగ్గించుకోవడం మానేసి.. ముందు మంచి సినిమాల మీద దృష్టి పెట్టి సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నా.. మంచి సినిమాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది అంటూ బండ్ల గణేష్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.