నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమాలతో బిజీగా వున్నారు. NBK107 తో పాటుగా రీసెంట్ గా NBK108 అప్ డేట్ కూడా రావడంతో బాలయ్య ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ బంద్ ఉండడంతో బాలయ్య NBK107 షూట్ కూడా ఆగింది. ఇక రీసెంట్ గా బాలయ్య చెల్లెలు ఉమా మహేశ్వరీ ఆత్మహత్య చేసుకోవడంతో బాలయ్య కన్నీటి పర్యంతమయ్యారు. చెల్లెలు దశదిన కర్మ అయ్యేవరకు ఆ పనులతో బిజీగా వున్న ఆయన రీసెంట్ గా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారని చూసి టీం ని అప్రిషియేట్ చేసారు. అయితే బాలయ్య పొలిటికల్ గాను తనని ఎమ్యెల్యే ని చేసిన హిందూపూర్ ప్రజలకి చేరువలోనే ఉంటూ ఉంటారు.
ఇప్పుడు హిందూపురం ప్రజల కోసం బాలకృష్ణ ప్రత్యేకంగా ఉచిత ఆరోగ్య సేవల కోసం వినూత్న రీతిలో ఓ కార్యక్రమం చేపట్టారు. హిందూ పురం ప్రజల కోసం ఉచిత ఆరోగ్య రథాన్ని ఏర్పాటు చేసారు. గ్రామాల వారీగా వైద్య సేవలు, వ్యాధి నిర్దారణ పరీక్షలు, మాత శిశు సంక్షేమ, ఆరోగ్య అవగాహనా సదస్సు గ్రామాల్లో ఏర్పాటు చేసేలా 40 లక్షల ఖర్చుతో బాలకృష్ణ.. NTR ఉచిత ఆరోగ్య రథాన్ని ఏర్పాటు చేసారు. ఈ వాహనాల్లో ఓ డాక్టర్, ఓ నర్స్, కంప్యూటర్ ఆపరేటర్, ఆరుగురు వైద్య సిబ్బందితో పాటుగా ఓ మెడికల్ కౌంటర్ కూడా ఉండబోతుంది. ఈ ఆరోగ్య రాధాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ వాహనం ప్రతి రోజు ఓ గ్రామానికి వెళ్లి అక్కడే వ్యాధి నిర్ధారణ చేసి ఉచితంగా మందులు పంపిణి చేసే ఏర్పాట్లు చేసారు.