ఫైనల్లీ బాలయ్య కూడా చూసేసారు
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ఆగష్టు 5 న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు కళ్యాణ్ రామ్ మేనత్త, బాలకృష్ణ చిన్న చెల్లెలు ఉమా మహేశ్వరీ ఆత్మహత్య చేసుకోవడంతో నందమూరి ఫ్యామిలీ అంతా ఆ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. బింబిసార సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించడమే కాదు, కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే కళ్ళు చెదిరే కలెక్షన్స్ వచ్చాయి. అంతేకాకుండా మూడు రోజుల్లోనే కళ్యాణ్ రామ్ బింబిసారతో లాభాల బాట పట్టాడు. దర్శకుడు వసిష్ఠ ని అందరూ పొగుడుతుంటే.. ఈ సినిమాని బాలకృష్ణ ఎప్పుడెప్పుడు చూస్తారా అనే అతృతతో నందమూరి ఫాన్స్ ఉన్నారు. అసలే కళ్యాణ్ రామ్ బింబిసార ఈవెంట్ లోను బాలయ్య కనిపించలేదు. ఇప్పుడైనా సినిమా చూసి రివ్యూ ఇస్తే బావుంటుంది అనేది వాళ్ళ కోరిక.
అయితే బాలకృష్ణ మాత్రం చెల్లి దశదిన కర్మ అయ్యేవరకు బింబిసార చూడలేదు. ఈ గురువారం 11 వ రోజు ఉమామహేశ్వరి పెద్ద రోజు కావడంతో చెల్లెలి ఇంటికి వెళ్లి అన్ని పనులు ముగించేసిన బాలకృష్ణ నేడు బింబిసారని వీక్షించారు. బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, కళ్యాణ్ రామ్ అక్క సుహాసిని ఇలా అందరూ బింబిసార చూసి హ్యాపీ ఫేస్ తో బయటికి వస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నందమూరి ఫాన్స్ సంతోషపడిపోతున్నారు. ఫైనల్లీ బాలయ్య బాబు బింబిసార చూసారు అంటూ..