Advertisementt

సలార్ సెన్సేషన్ రెడీ

Sat 13th Aug 2022 04:27 PM
salaar movie,prabhas,prashanth neel  సలార్ సెన్సేషన్ రెడీ
Salaar massive update out సలార్ సెన్సేషన్ రెడీ
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ మూవీ పై అంచనాలు భారీ లెవల్ లో ఉన్నాయి. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేస్తున్న ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా కటౌట్ ఉన్న ప్రభాస్ మూవీ అంటే అంచనాలు కొలతల్లో కొలవడం కష్టమే. అందుకే సలార్ నుండి ఎప్పుడు ఏ లీక్ వస్తుందా? ఎప్పడు ఏ అప్ డేట్ వస్తుందా? అని ప్రభాస్ ఫాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. సలార్ టీజర్ కోసం గత రెండు నెలలుగా వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫాన్స్ కి సలార్ అప్ డేట్ ఆలస్యమయ్యే కొద్దీ వారిలో సహనం సచ్చిపోయి సోషల్ మీడియాలో అప్ డేట్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ లు పెడుతూ రచ్చ చేస్తున్నారు.

అయితే రెండు రోజుల్లో సలార్ మాసివ్ అప్ డేట్ అంటూ ప్రకటించడమే తరువాయి ఆగష్టు 15 న మధ్యాన్నం 12.58 నిమిషాలకు ఆ అప్ డేట్ ఇవ్వబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఆగస్ట్ 15 న సలార్ నుండి టీజర్ అప్ డేట్ ఇస్తారంటూ ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇతర హీరోల పేరిట ఉన్న నెంబర్ వన్ రికార్డ్ లపై ప్రభాస్ ఫాన్స్ కన్ను ఉంది. ఆ రికార్డులని సలార్ టీజర్ రిలీజ్ అయ్యాక లైక్స్, వ్యూస్ తో కొలాప్స్ చెయ్యడానికి కాచుకుని కూర్చున్నారు. 

Salaar massive update out:

Salaar set for massive I-Day sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ