లక్కీ హీరోయిన్ గా యంగ్ హీరోలతో వరస సినిమాలు చేస్తూ బాగా బిజీగా మారిన కృతి శెట్టి కి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ షాక్ లు తగిలాయి. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పదిహేడేళ్ల కృతి శెట్టి కి తర్వాత వరస హిట్స్ పడడమే కాదు, ఒకేసారి నలుగురైదుగురు హీరోల ఛాన్స్ లు వచ్చిపడ్డాయి. ఉప్పెన రిలీజ్ అవ్వకుండానే బేబమ్మకి లక్కీ ఛాన్స్ లు తగిలాయి. అందులో శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు లు హిట్ అయినా.. ఈ ఏడాది నెల గ్యాప్ లో విడుదలైన ద వారియర్ మూవీ బేబమ్మ కెరీర్ లో ఫస్ట్ షాక్. రామ్ హీరోగా లింగుసామి తెలుగు, తమిళ్ లో తెరకెక్కించిన వారియర్ మూవీ డిసాస్టర్ అవడం తో మోడరన్ గా విజిల్స్ వేస్తూ రెచ్చిపోయిన మహాలక్ష్మి కృతి శెట్టి కి వారియర్ ప్లాప్ గట్టిగా తగిలింది.
నెల తిరక్కుండానే నితిన్ మాచర్ల నియోజక వర్గం మూవీ తో ఆడియన్స్ ముందుకు రాగా.. ఆ సినిమా భారీ డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది. నిన్న శుక్రవారం విడుదలైన మాచర్ల నియోజకవర్గం రిలీజ్ అవ్వగా.. ఫస్ట్ హాఫ్ సినిమాకి డివైడ్ టాక్ పడిపోయింది. మార్నింగ్ షో పూర్తయ్యేసరికి.. సినిమా లో ఏం లేదని తేల్చేసారు. అటు క్రిటిక్స్ నుండి, ఇటు ఆడియన్స్ నుండి ఒకటే మాట. అమ్మో మాచర్ల రాడ్ మూవీ, ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ చూడలేదు అంటున్నారు. అలాగే సినిమాలో కృతి శెట్టి పెరఫార్మెన్స్ పరంగా తేలిపోయినా.. గ్లామర్ పరంగా మంచి మార్కులు వేయించుకుంది. కానీ సినిమాకొచ్చిన టాక్ కృతి శెట్టి మీద పడడం ఖాయం. మరి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లతో కాస్త డల్ అయిన కృతి శెట్టి ఆశలన్నీ సుధీర్ బాబు సినిమాపైనే పెట్టుకుంది. ఆ సినిమా కూడా వచ్చేనెల 17 న రిలీజ్ కాబోతుంది.