Advertisementt

ఇటు చిరు, అటు రజిని..

Sat 13th Aug 2022 10:45 AM
tamannaah,rajinikanth,jailer tamil movie  ఇటు చిరు, అటు రజిని..
Chiru here, Rajini there.. ఇటు చిరు, అటు రజిని..
Advertisement
Ads by CJ

హీరోయిన్ గా సీనియర్స్ లిస్ట్ లోకి వెళుతున్న మిల్కి బ్యూటీ తమన్నా కి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి వన్నెతరగని అందంతో గ్లామర్ షో చేసే తమన్నా.. వరసగా సినిమాలు చేస్తూనే ఉంది. మధ్యలో వెబ్ సీరీస్ కూడా చేసిన ఆమె ఇప్పుడు సీనియర్ హీరోలకి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంకర్ మూవీలో గ్లామర్ చూపించడానికి రెడీ అయ్యింది. మెహర్ రమేష్ డైరెక్షన్ లో చిరు - కీర్తి సురేష్ అన్న చెల్లెళ్లుగా కనిపించబోతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్.

ఇక తాజాగా రజినీకాంత్ జైలర్ లోను తమన్నా కి ఛాన్స్ వచ్చింది అంటున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చెయ్యబోయే జైలర్ మూవీ షూటింగ్ వచ్చే వారం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మొదలు కాబోతుంది అనే టాక్ ఉండగా.. ఇప్పుడు హీరోయిన్ లిస్ట్ లో తమన్నా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఎప్పటినుండో రజినీకాంత్ తో కలిసి పని చెయ్యాలని ఉంది అని చెబుతున్న తమన్నాకి ఈ అవకాశం అవస్తే.. జైలర్ తో ఆ ముచ్చట తీరిపోతుంది.

Chiru here, Rajini there..:

Tamannaah joins Superstar Rajinikanth Jailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ