టాలీవుడ్ లో అగ్రనిర్మాతగా మారిన అశ్విని దత్ వైజయంతి బ్యానర్ పై స్టార్ హీరోల సినిమాలు నిర్మించారు. కాకపోతే ఎన్టీఆర్ - మెహెర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన శక్తి ఆయన శక్తిని హరించేసింది. శక్తి సినిమాతో భారీగా లాస్ అయినట్లుగా ఆయన పలు సందర్భాల్లో చెప్పారు కూడా. శక్తి సినిమా తర్వాత ఆయన ప్రొడక్షన్ నుండి సినిమాలు తగ్గిపోయాయి. మళ్ళీ అల్లుడు నాగ్ అశ్విన్ హయాంలోకి వచ్చాక మహానటితో భారీ హిట్ కొట్టడమే కాదు, రీసెంట్ గా సీత రామంతో అద్భుతమైన హిట్ అందుకున్నారు. తర్వాత ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె లాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నారాయన. ఈ మధ్యన తరచూ మీడియా ముందుకు వస్తున్న అశ్విని దత్ తాను నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 16 లక్షలతో సినిమా తీశానని గుర్తు చేసుకున్నారు.
అంతేకాకుండా తాను తీసిన జగదేకవీరుడు అతిలోక సుందరి అంత బ్లాక్ బస్టర్ మళ్ళీ జగదేక వీరుడు అతిలోక సుందరి - 2 సినిమా చేశాకే నిర్మాతగా సినిమాలకి, కెరీర్ కి ఫుల్ స్టాప్ పెడతాను అంటూ మాట్లాడారు. అయితే రాజమౌళి తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేసినప్పుడు ముందుగా ఆ సినిమాకి ప్రభాస్ ని అనుకున్నామని, తర్వాత ఆ ప్రాజెక్ట్ లోకి ఎన్టీఆర్ వచ్చాడని ఆయన చెప్పారు. అలాగే తాను అరవింద్ కలిసి చూడాలని ఉంది సినిమా హిందీలో రీమేక్ చేసి తలో ఆరు కోట్లు పోగొట్టుకున్నామంటూ ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.