Advertisementt

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి కూడా గుడ్ న్యూస్

Fri 12th Aug 2022 10:54 PM
hari hara veeramallu,pawan kalyan,krish  పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి కూడా గుడ్ న్యూస్
Good news for Pawan Kalyan fans పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి కూడా గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సినిమాల అప్ డేట్స్ తెలియక పవర్ స్టార్ ఫాన్స్ కూడా అయోమయంలోనే ఉన్నారు. అయితే అక్టోబర్ 5 నుండి పవన్ కళ్యాణ్ ప్రజా యాత్ర  అనే పేరుతొ ప్రజల్లోకి వెళ్ళబోతున్నాడన్న  విషయం తెలిసిందే. ఈ మేరకు సెప్టెంబర్, అక్టోబర్ రెండు నెలల్లో క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లుని పూర్తి చేస్తాడని లేదా సముద్రఖని డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ తో చేసే సినిమా కి ఎలాట్ చేసిన 20 డేస్ కేటాయిస్తాడని రెండు రకాలుగా మాట్లాడుకుంటున్నారు.

అయితే ఇండస్ట్రీ లో షూటింగ్ సమ్మె కారణంగా, పవన్ కళ్యాణ్ అస్వస్థత కారణంగా ఏది జరగలేదు. కానీ పవర్ స్టార్ ఫాన్స్ తాకిడి తట్టుకోవడానికి, వాళ్ళకో గుడ్ న్యూస్ చెప్పడానికి శాయశక్తులా శ్రమిస్తున్నాడు దర్శకుడు క్రిష్. హరి హర వీరమల్లు నుంచి ఆగస్టు 15 న ఓ అప్ డేట్ రాబోతుంది అనేది చిత్ర యూనిట్ ద్వారా తెలిసిన సమాచారం. నిర్మాత, దర్శకుడు ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ అంగీకారం తెలపడం ఒక్కటే బ్యాలెన్స్. పవన్ కళ్యాణ్ ఓకె అంటే గనక హరి హర వీరమల్లు నుండి ఆగష్టు 15 న మీరెవ్వరూ అస్సలు ఊహించని ఓ సర్ ప్రైజింగ్ అప్ డేట్ చూడబోతున్నారు. 

Good news for Pawan Kalyan fans:

Hari Hara Veeramallu update on August 15th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ