Advertisementt

ప్రమోషన్స్ చేసుకోనివ్వండయ్యా..

Fri 12th Aug 2022 09:58 PM
liger movie,vijay devarakonda,ananya,pune  ప్రమోషన్స్ చేసుకోనివ్వండయ్యా..
Liger Movie: Vijay Devarakonda, Ananya forced to leave from Pune mall ప్రమోషన్స్ చేసుకోనివ్వండయ్యా..
Advertisement
Ads by CJ

ఒక సినిమాకి ప్రమోషన్స్ ఎంత కీలకమో సినిమాలు తీసే ప్రతి ఒక్క హీరోకి, నిర్మాతలకి తెలుసు. అందుకే ప్రమోషన్స్ కోసం నిద్ర కూడా మానేసి కష్టపడతారు. అదే పాన్ ఇండియా మూవీ అయితే ఎక్కే ఫ్లైట్ ఎక్కడం దిగే ఫ్లైట్ దిగడం ఇలా ఉంటుంది మేకర్స్, హీరోల పరిస్థితి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించిన లైగర్ ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం చుట్టేస్తున్నాడు. తన పోరి అనన్య పాండే తో కలిసి మరీ విజయ్ షాపింగ్ మాల్స్, ఈవెంట్స్ అంటూ తిరుగుతుంటే రౌడీ ఫాన్స్ మాత్రం విజయ్ దేవరకొండ ఎక్కడకనబడితే అక్కడ రచ్చే అన్నట్టుగా తయారైంది వ్యవహారం. 

విజయ్ దేవరకొండ ఫాన్స్ అభిమానం ఎక్కువవడంతో చాలా ఈవెంట్స్ నుండి మధ్యలో వెళ్ళిపోతున్నాడు. ప్రస్తుతం లైగర్ ఈవెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఫాన్స్ విజయ్ దేవరకొండ మ్యానియాతో ఊగిపోతున్నారు. పూణే, ముంబై, వడోదర, అహ్మదాబాద్ ఇలా ఎక్కడ చూసినా విజయ్ ఫాన్స్ హంగామానే, కనీసం సినిమా ప్రమోషన్స్ కూడా చేసుకోనివ్వడం లేదు. తాజాగా పూణే లో లైగర్ ఈవెంట్ నిర్వహించగా.. అక్కడికి అభిమానులు పెద్ద ఎత్తున రావడమే కాదు, విజయ్, అనన్యలు స్టేజ్ పైకి వచ్చారో.. లేదో.. ఫాన్స్ అత్యుత్సాహంతో బారికేడ్లు తోసుకుని స్టేజ్ పైకి వచ్చెయ్యడంతో విజయ్ దేవరకొండ చేసేది లేక అక్కడినుండి వెళ్ళిపోయాడు. అది చూసిన నెటిజెన్స్.. ప్రమోషన్స్ చేసుకోనివ్వండిరా బాబు.. మరీ అంత అభిమానం పనికిరాదు అంటూ ఫాన్స్ పై సెటైర్స్ వేస్తున్నారు.

Liger Movie: Vijay Devarakonda, Ananya forced to leave from Pune mall:

Liger craze in Pune: VD, Ananya forced to leave

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ