Advertisementt

2 డేస్ వెయిట్ చేయమంటున్న సలార్ మేకర్స్

Fri 12th Aug 2022 08:05 PM
salaar movie,prabhas,fans,prashanth neel  2 డేస్ వెయిట్ చేయమంటున్న సలార్ మేకర్స్
Salaar update in two days 2 డేస్ వెయిట్ చేయమంటున్న సలార్ మేకర్స్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఫాన్స్ గుడ్ న్యూస్ ల మీద గుడ్ న్యూస్ లు వింటున్నారు. తాజాగా అశ్విని దత్ ప్రాజెక్ట్ కె షూటింగ్ అప్ డేట్ ఇవ్వగా.. ఇప్పుడు ఆయన మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్ నుండి గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ రాబోతున్నట్టుగా అది కూడా కేవలం రెండు రోజుల్లోనే అని తెలిసిన ప్రభాస్ ఫాన్స్ అస్సలాగడం లేదు. సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ కే, సలార్ హాష్ టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ పూనకాలు తెప్పిస్తున్నారు. పాన్ ఇండియా సెన్సేషన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిస్తున్న సలార్ పై క్రేజ్ మాములుగా లేదు.

శృతి హాసన్ ప్రభాస్ తో ఫస్ట్ టైం రొమాన్స్ చేస్తుండగా, మలయాళ పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే సలార్ రెస్యూమ్ షూట్ స్టార్ట్ అయిన ఓ నెలలోనే సలార్ టీజర్ రిలీజ్ అని మేకర్స్ చెప్పినా.. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. దానితో ప్రభాస్ ఫాన్స్ ప్యానిక్ అవుతున్నారు. అంతేకాదు రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు మరో రెండు రోజుల్లో సలార్ అప్ డేట్ అనేసరికి అది టీజర్ అప్ డేట్ కావొచ్చు అనే ఊహల్లో ప్రభాస్ ఫాన్స్ తేలిపోతున్నారు. మేకర్స్ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి 2 డేస్ వెయిట్ చెయ్యండి మీకు మంచి ట్రీట్ ఇస్తామంటూ ప్రకటించారు. 

Salaar update in two days:

prabhas-Prashanth neel Salaar update in two days

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ