Advertisementt

ఒకే ఏడాది నాలుగు సినిమాలతో కృతి శెట్టి

Fri 12th Aug 2022 08:38 AM
krithi shetty,uppena,macharla niyojakavargam  ఒకే ఏడాది నాలుగు సినిమాలతో కృతి శెట్టి
Krithi Shetty with four fields in one year ఒకే ఏడాది నాలుగు సినిమాలతో కృతి శెట్టి
Advertisement
Ads by CJ

ఉప్పెన సినిమా దగ్గర నుండి ఎదురులేని పోరి కృతి శెట్టికి ద వారియర్ బ్రేకులు వేసింది. ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అవడం, ఆ ఏడాది శ్యామ్ సింగ రాయ్ తో హిట్ కొట్టిన కృతి శెట్టి ఈ ఏడాది ఆరంభంలోనే బంగార్రాజు తో బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆరు నెలలకే రామ్ తో కలిసి వారియర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. వారియర్ మాత్రం పాపకి షాకిచ్చింది. విజిల్ మహాలక్ష్మిలా మోడరన్ అమ్మాయిలా కనిపించినా పని జరగలేదు.

వారియర్ తర్వాత నెలతిరక్కుండానే ఈ రోజు శుక్రవారం నితిన్ తో కలిసి నటించిన మాచర్ల నియోజకవర్గంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో కృతి శెట్టి ట్రెడిషనల్ గాను, అలాగే గ్లామర్ గాను కనువిందు చేయబోతుంది. ఈ సినిమాపై అమ్మడు ఆశలు బాగానే పెట్టుకుంది. మరి ఈ సినిమా సంగతి అలా ఉంటే.. మరో నెలలోనే కృతి శెట్టి ఈ ఏడాది నాలుగో సినిమాని కూడా థియేటర్స్ లో దింపేందుకు రెడీ అయ్యింది. అది సుధీర్ బాబు తో కలిసి నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సెప్టెంబర్ 16 న రిలీజ్ కి రెడీ అవ్వడంతో.. కృతి శెట్టి ఈ ఏడాది నాలుగు సినిమాలతో అదృష్టాన్ని పరిక్షించుకుంటుంది. ఇప్పటికే ఒక హిట్, ఒక ఫట్ ఉండగా.. ఇప్పుడు రెండు సినిమాలతో లక్కు కోసం ఎదురు చూస్తుంది. 

Krithi Shetty with four fields in one year:

Lucky Heroine Krithi Shetty Heroine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ