Advertisementt

అయ్యో నాగ చైతన్య కి మరోసారి నిరాశే

Thu 11th Aug 2022 10:22 PM
akkineni fans,naga chaitanya,laal sing chadda hindi movie  అయ్యో నాగ చైతన్య కి మరోసారి నిరాశే
Another Disappointment For Naga Chaitanya అయ్యో నాగ చైతన్య కి మరోసారి నిరాశే
Advertisement
Ads by CJ

ఈ ఏడాది ప్రథమార్ధంలో బంగార్రాజు తో హిట్ కొట్టిన నాగ చైతన్య ద్వితీయార్ధంలో థాంక్యూ తో డిసాస్టర్ చూడాల్సి వచ్చింది. అమీర్ ఖాన్ లాంటి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించే అవకాశం రావడంతో బాలీవుడ్ లో తనకు మంచి ఎంట్రీ ఫిలిం అవుతుంది అని భావించిన నాగ చైతన్య డీ గ్లామరైజెడ్ రోల్ అయినా ఒప్పుకుని లాల్ సింగ్ చద్దా చేసాడు. అయితే అక్కడ బాలీవుడ్ ఎంట్రీ కూడా నాగ చైతన్య కి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. 

టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోను నాగ చైతన్య కి బ్యాక్ టు బ్యాక్ నిరాశే ఎదురైంది. లాల్ సింగ్ చద్దా డిసాస్టర్ కావడం నాగ చైతన్య కి నిజంగా బ్యాడ్ లాక్ అనేచెప్పాలి. అదే సినిమా హిట్ అయినట్లయితే.. నాగ చైతన్య కి బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచేది. నాగచైతన్య ఏ మాత్రం తన కెరీర్‌కు హెల్ప్ కానీ, ప్రేక్షకుల గుర్తింపుకు నోచుకోలేని బాలరాజు పాత్రలో కనిపించాడు. క్యారెక్టర్ బలంగా లేకపోవడం ఒక ఎత్తైతే.. నోట్లో డెంటల్ క్లిప్ పెట్టి.. చైతు లుక్స్ ఆడియన్స్ ని మరింత ఇబ్బంది పెట్టాయి. ఈ సినిమాతో చైతు అక్కినేని ఫ్యాన్స్‌కు నిరాశే మిగిల్చాడు.

ఈ రోజు గురువారం విడుదలైన లాల్ సింగ్ చద్దా కి డిసాస్టర్ టాక్ పడడమే కాదు, సినిమాని సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతున్నారు. వన్ వార్డ్ రివ్యూ అంటూ.. డిస్పాయింటెడ్ అంటూ తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అమిర్ ఖాన్ ని ఆడేసుకుంటున్నారు.

Another Disappointment For Naga Chaitanya:

Akkineni fans happy for Naga Chaitanya Laal Sing Chadda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ