బాలీవుడ్ లో 40 ప్లస్ లోను అందాలు ఆరబోస్తూ ఫ్యాషన్ షోస్ కి, అలాగే అవార్డు ఫంక్షన్స్ కి హాజరవుతూ.. జిమ్ వర్కౌట్ అవుట్ ఫిట్స్ తో సెగలు రేపే మలైకా అరోరా.. తనకన్నా చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చెయ్యడమే కాదు, నిన్నమొన్నటివరకు సీక్రెట్ గా మెయింటింగ్ చేసిన ఎఫ్ఫైర్ ని ఇప్పుడు బట్టబయలు చేసేసింది ఈ జంట. పార్కులకి, పార్టీలకి, వెకేషన్స్ కి కలిసి తిరగడమే కాదు, బర్త్ డే పార్టీస్ అంటూ స్పెషల్ గా ఫొటోస్ దిగుతూ సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తున్నారు. ఈమధ్యన మలైకా అరోరా, అర్జున్ కపూర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
తాజాగా కాఫీ విత్ కరణ్ షో లో కరణ్ జోహార్ అర్జున్ కపూర్ ని మలైకా తో పెళ్ళెప్పుడు అని అడగగానే.. అర్జున్ కపూర్ దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు. నేను మలైకా ని అప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు. అందుకు టైం పడుతుంది. కరోనా, కరోనా అంటూ రెండేళ్లు సినిమాలు, షూటింగ్స్ లేక అలా టైం గడిచిపోయింది. ఇప్పుడు నేను నా కెరీర్ మీద దృష్టిపెట్టాలని అనుకుంటున్నా. నా వర్క్ నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను హ్యాపీ మోడ్ లో ఉంటేనే కదా నా భాగస్వామిని నేను సంతోషపెట్టగలను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేమీ లేవు అంటూ షాకిచ్చాడు ఈ కుర్ర హీరో.