యాంకర్ అనసూయ.. ఈటివి జబర్దస్త్ కి బై బై చెప్పేసి అందరికి షాకిచ్చింది. సినిమా అవకాశాలు కారణంగా తాను జబర్దస్త్ వదిలేస్తున్నట్టుగా, ఇంత ప్రేమని తనపై చూపించిన అందరూ తర్వాత కూడా ఇదే ప్రేమని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నట్టుగా చెప్పి ఎమోషనల్ అయ్యింది. మరోపక్క జబర్దస్థ్ కమెడియన్స్ నెలలో మూడు రోజులు మా కోసం కేటాయించలేవా అని అడిగినా నో చెప్పిన అనసూయ ఇకపై ఈటివి లో కనిపించదు, ఆమె ఇక్కడ జరిగే అన్ని ప్రోగ్రామ్స్ కి బై బై చెప్పేసింది అనే టాక్ కూడా నడిచింది.
కానీ అనసూయ జబర్దస్త్ ని మాత్రమే వదిలింది ఈటివి ని కాదు అంటూ శ్రావణ సందడి ప్రోగ్రాం కి యాంకర్ గా వచ్చేసింది. తాజాగా శ్రావణ సందడి ప్రోమో వదలగా అందులో అనసూయ అదిరిపోయే డాన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. యాంకర్ రవి తో కలిసి యాంకరింగ్ చేసిన అనసూయ లుక్స్ నిజంగా బ్యూటిఫుల్, పండగ కళ మొత్తం అనసూయ దగ్గరే ఉందా అనిపించేంత ట్రెడిషనల్ గా కనిపించింది. రాకింగ్ రాకేష్.. ఎప్పుడొస్తావ్ అనసూయ అంటూ జబర్దస్త్ కి మళ్ళీ రమ్మన్నట్టుగా అడిగిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అందులో బిగ్ బాస్ సిరి, జ్యోతి అందరూ ఎంతో అందంగా కనిపించినా అందరిని అనసూయ తన లుక్స్ తో తొక్కేసింది అనే చెప్పాలి. ఈ శ్రావణ సందడి అతి త్వరలోనే ఈటీవీలో రాబోతుంది.