Advertisementt

బిగ్ బాస్ 6: కొత్త లిస్ట్

Thu 11th Aug 2022 09:39 AM
bigg boss 6,bigg boss telugu,nagarjuna  బిగ్ బాస్ 6: కొత్త లిస్ట్
Bigg Boss 6: New List బిగ్ బాస్ 6: కొత్త లిస్ట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 వచ్చేస్తుంది. స్టార్ మా వేదికగా బిగ్ బాస్ సీజన్ 6 కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. తాజాగా ప్రోమో కూడా వదిలారు. బిగ్ బాస్ ఓటిటిలో వచ్చినప్పుడు కొంతమంది బుల్లితెర ప్రేక్షకులు డిస్పాయింట్ అయినా.. మళ్ళీ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా స్టార్ మా కోసం బిగ్ బాస్ యాజమాన్యం అన్ని రెడీ చేసేస్తుంది. అయితే ఈ నెలాఖరులోనే  బిగ్ బాస్ సీజన్ 6 మొదలవుతుంది అన్నప్పటికీ.. అది సెప్టెంబర్ మొదటి వారానికి పోస్ట్ పోన్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ కొత్త హౌస్, అలాగే దానికి సంబందించిన ఏర్పాట్లు పూర్తికాగా.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే కొంతంది కంటెస్టెంట్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. 

అందులో యాంకర్ ఉదయభాను, అలాగే న్యూస్ యాంకర్ ప్రత్యూష, ఇంకా సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ లు కన్ ఫర్మ్ అంటుంటే.. ఇప్పుడు జబర్దస్త్ నుండి ట్రాన్స్ జెండర్ తన్మయ్, ఇంకా చలాకి చంటి వస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. ఇక ఇప్పుడు యాంకర్ నేహా చౌదరి, యాంకర్ నిఖిల్, యూట్యూబర్ ఆది రెడ్డి, గీతూ రాయల్, జబర్దస్త్ అప్పారావు లాంటి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అలాగే సామాన్యుల్లో ఓ ముగ్గురు ఈసారి హౌస్ లోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Read: బిగ్ బాస్ సీజన్6 లోకి వారు ఫిక్స్

Bigg Boss 6: New List:

Bigg Boss 6: Tentative list of the contestants is out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ