కాఫీ విత్ కరణ్: విజయ్ దేవరకొండ కి కాలింది

బాలీవుడ్ లో పాపులర్ షో అయిన కాఫీ విత్ కరణ్ షో లో విజయ్ దేవరకొండ- అనన్య పాండే లు వారు నటించిన లైగర్ ప్రమోషన్స్ కోసం పాల్గొన్న విషయం తెలిసిందే. కానీ అక్కడ కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ పర్సనల్ లైఫ్ నే టార్గెట్ చేసాడు. తర్వాత అదే షో లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లు పాల్గొనగా.. అప్పుడు జాన్వీ కపూర్, సారా ఇద్దరూ విజయ్ దేవరకొండ తో డేటింగ్ చెయ్యాలని ఉంది అంటూ చెప్పారు. ఆ ఇంటర్వ్యూలోనే కరణ్ జోహార్ విజయ్ దేవరకొండని ఛీజ్ తో పోల్చారు.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ - అనన్య పాండే లు లైగర్ ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం తిరుగుతున్నారు. విజయ్ నిద్ర లేకుండా లైగర్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. తాజాగా చెన్నైలో జరగబోయే లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టీం చెన్నై వెళ్ళింది. అయితే ముంబైలో లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ కారు దిగి ఈవెంట్ కి వెళ్ళేటప్పుడు ఓ అభిమాని కాఫీ విత్ కరణ్ షో లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చేలా విజయ్ అన్నా మీకు ఛీజ్ కావాలా? అంటూ అరవడంతో విజయ్ దేవరకొండ చిన్నబుచ్చుకోవడమే కాకుండా, కోపంగానే అక్కడినుండి స్పీడుగా వెళ్ళిపోయిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవ్వగా.. కాఫీ విత్ కరణ్ షో పై విజయ్ దేవరకొండ అసంతృప్తిగా ఉన్నాడంటూ వార్తలు మొదలయ్యాయి.
Liger star Vijay Deverakonda upset with his episode of Koffee With Karan 7?
Liger Star Vijay Deverakonda Is Upset?







































