Advertisementt

సమంత ఎదురైతే.. చైతు ఏం చేస్తాడంటే..

Wed 10th Aug 2022 12:17 PM
naga chaitanya,samantha,samantha-chaitu  సమంత ఎదురైతే.. చైతు ఏం చేస్తాడంటే..
Naga Chaitanya Says He Will Give A Hug To Ex-Wife Samantha సమంత ఎదురైతే.. చైతు ఏం చేస్తాడంటే..
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంత ప్రేమ విషయం తెలిసినప్పటినుండి ఇప్పటికీ అంటే విడాకులు తీసుకుని వేరైనా మీడియాలో సంచలనంగానే నిలుస్తున్నారు. కెరీర్ వైజ్ టాప్ ఫామ్ లో ఉన్న సమంత-నాగ చైతన్యలు వ్యక్తిగత కారణాల రీత్యా వారి ప్రేమకి, పెళ్ళికి విడాకులతో స్వస్తి చెప్పారు. కానీ అందుకు నొచ్చుకున్న అభిమానులు సోషల్ మీడియాలో ఎవరికీ తోచిన కామెంట్స్ వాళ్ళు చేస్తూ వుంటే.. మీడియా కూడా చైతు - సమంతలు ఎదురైనా ప్రతిసారి వారి విడాకులపైనే ప్రశ్నలు వేస్తూ విసిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ టాక్ షో కి హాజరైన సమంత తననీ - చైతూని ఒకే గదిలో ఉంచితే అక్కడ పదునైన వస్తువులేవీ ఉంచకూడదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ ఇద్దరి మధ్య ఏర్పడ్డ అగాధాన్ని స్పష్టం చేసాయి.

కానీ నాగ చైతన్య ని సమంత ఎదురు పడితే ఏం చేస్తారు అంటే.. చైతు మాత్రం సమంత ఎదురైతే హాయ్ చెప్పడమే కాదు, హగ్ కూడా చేసుకుంటాను అని చెప్పడంతో సమంత ఫాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. సమంత అంత వైల్డ్ గా స్పందిస్తే.. చైతూ మాత్రం ఎంతో హుందాగా, డీసెంట్ గా స్పందించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు.. తన చేతిపై సమంత తో పెళ్లి తేదీని టాటూ వేయించుకున్నాను అని, కానీ ఆ టాటూ ని తొలగించుకునే ఉద్దేశ్యం లేదని చెప్పాడు చైతు. 

👉 చై-సామ్ డివోర్స్ : సీనియర్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్

Naga Chaitanya Says He Will Give A Hug To Ex-Wife Samantha:

Naga Chaitanya reveals what he will do if he meets Samantha now

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ