మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా SSMB28 నుండి రాబోయే అప్ డేట్ కోసం మహేష్ ఫాన్స్ ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మహేష్ బర్త్ డే వచ్చేసింది.. SSMB28 నుండి మహేష్ ఫోటో ని వదులుతూ.. ఆయనకి విషెస్ చెప్పేసారు మేకర్స్. ఆగస్టు నుండి SSMB28 రెగ్యులర్ షూట్ అని ప్రకటించినా ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న షూటింగ్స్ బంద్ కారణంగా ఇప్పుడు ఈ మూవీ ఎప్పుడు మొదలు పెడతారో క్లారిటీ లేదు. అతడు, ఖలేజా వంటి హిట్ సినిమాల తర్వాత భారీ గ్యాప్ తో త్రివిక్రమ్ - మహేష్ జోడి కడుతున్నారు. పూజ హెగ్డే కథానాయిక కాగా థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ తో చెయ్యబోయే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం విశేషం.
నాకు త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అన్నా, ఆయన డైరెక్షన్ అన్నా చాలా ఇష్టం. ఒక సినిమాను అన్ని వైపుల నుంచి అద్భుతంగా తీర్చిదిద్దుకుంటూ రావడం ఆయన ప్రత్యేకత. 12 ఏళ్ళ తర్వాత మళ్లీ ఇన్నాళ్ళకి మా కాంబినేషన్ సెట్ అయింది. ఆయనతో కలిసి మళ్లీ పని చేయడానికి నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను. త్రివిక్రమ్ గారితో వర్క్ చెయ్యడానికి నేను చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నాను. SSMB28 కోసం కొత్తదనం ఉన్న కథని ఎంచుకున్నారు. డిఫరెంట్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతుంది. ఇప్పటివరకు ఆయన కానీ, నేను కానీ ఇలాంటి సినిమా చెయ్యలేదు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు, అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఉంటుందని హామీ ఇస్తున్నాను అంటూ మహేష్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.