నాగ చైతన్య థాంక్యూ మూవీ నిరాశపరచగా.. ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న లాల్ సింగ్ చద్దా రిలీజ్ కి రెడీ అయ్యింది. లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లోను, లాల్ సింగ్ చద్దా ప్రీమియర్స్ కి స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తున్న చైతు దూత వెబ్ సీరీస్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. అయితే నాగ చైతన్య నెక్స్ట్ మూవీ తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో చైతు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
అయితే ఈ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా కృతి శెట్టి నటించబోతుంది. ఆ తర్వాత చైతు సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురామ్ తో 14 రీల్స్ లో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో చైతు కి జోడిగా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న రష్మిక మందాన్నని హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారట. కానీ రష్మిక తెలుగు, తమిళ, బాలీవుడ్ మూవీస్ తో బాగా బిజీ గా ఉంటుంది. సో రష్మిక ఇచ్చే డేట్స్ ని బట్టి నాగ చైతన్య - పరశురామ్ ల మూవీ పట్టాలెక్కబోతుంది అని తెలుస్తుంది. మరి చైతూ ఖాళీ అయినా.. రష్మిక వలన ఈ సినిమా లేట్ అయ్యేలా కనబడుతుంది.