లైగర్ కి ముందు ఎలాంటి పాన్ ఇండియా మూవీ చెయ్యలేదు, టాలీవుడ్ లోను గీతం గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలు హిట్స్ తప్ప కెరీర్ లో అంతకు మించి అనేలా మరో మూవీ లేదు. కానీ దేశ వ్యాప్తంగా విజయ్ దేవరకొండ క్రేజ్ చూస్తుంటే స్టార్ హీరోలకి ఒణుకు వచ్చేసేలా ఉంది ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ క్రేజ్. ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ లోను విపరీతమైన అభిమానులని అన్ని చోట్ల చూసాం. కానీ లైగర్ ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా విజయ్ దేవరకొండ ని చూసేందుకు తొక్కేసుకుంటున్నారు అభిమానులు. చాలా చోట్ల అభిమానుల అభిమానం ఎక్కువవడంతో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య తో పాటుగా మధ్యలోనే జంప్ అవ్వాల్సిన పరిస్థితి.
బాలీవుడ్ లో సినిమాలు చెయ్యకపోయినా.. అక్కడి హీరోయిన్స్ కి విజయ్ దేవరకొండ అంటే క్రష్, ప్రతి యంగ్ హీరోయిన్ విజయ్ తో కలిసి వర్క్ చెయ్యాలని ఉంది అని చెబుతుంది. లైగర్ ట్రైలర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసి.. ప్రమోషన్స్ తో సినిమాపైనే అంచనాలు పెంచడం అటుంచి.. విజయ్ ఫాన్స్ అంతకంతకులు పెరిగిపోతున్నారు. విజయ్ క్రేజ్, రౌడీ ఫాన్స్ ని చూస్తే స్టార్ హీరోలే కుళ్ళుకునేలా ఉంది విజయ్ ఫాన్స్ తొక్కిసలాట. విజయ్ ఎక్కడికి వస్తున్నాడంటే అక్కడికి జనం ఇరగదీసుకుని పడిపోతున్నారు. అయ్యా తెల్వదు, తాతా తెల్వదు.. అయినా ఎందుకంత అభిమానం అన్నట్టుగా విజయ్ దేవరకొండ ని చూస్తే ఫాన్స్ కి పూనకాలే అన్నట్టుగా తయారయ్యింది లైగర్ ప్రమోషన్స్ లో అభిమానుల ఆత్రం.