Advertisementt

రవితేజ ఫ్యామిలీ నుండి మరో హీరో

Tue 09th Aug 2022 11:55 AM
ravi teja,madhav,nallamalupu bujji  రవితేజ ఫ్యామిలీ నుండి మరో హీరో
Ravi Teja Nephew, Madhav Debuting As Hero రవితేజ ఫ్యామిలీ నుండి మరో హీరో
Advertisement
Ads by CJ

రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజును హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏయ్... పిల్ల టైటిల్ ఖరారు చేశారు.

నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ హృదయానికి హత్తుకునే ఓ అందమైన ప్రేమకథా చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులకు చక్కటి అనుబూతి ఇస్తుంది. వింటేజ్ ప్రేమకథగా 90ల నేపథ్యంలో రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని అన్నారు. 

ఏయ్... పిల్లా చిత్రంలో మాధవ్ భూపతిరాజు సరసన మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ నటిస్తున్నారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. 

Ravi Teja Nephew, Madhav Debuting As Hero:

Ravi Teja Nephew, Madhav Debuting As Hero Under Nallamalupu Bujji Production 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ