Advertisementt

NTR30 పూజా కార్యక్రమాలు అప్పుడే

Mon 08th Aug 2022 10:02 PM
ntr30,koratala,ntr  NTR30 పూజా కార్యక్రమాలు అప్పుడే
NTR 30 opening soon NTR30 పూజా కార్యక్రమాలు అప్పుడే
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఆయన భుజం నొప్పి కారణంగా కొత్త సినిమా మొదలు పెట్టడం లేదు అంటున్నారు. అంతేకాకుండా ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బరువు తగ్గుతున్నారంటూ వార్తలు రావడమే కానీ ఎన్టీఆర్ ఫిజిక్ లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ఇక కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ చెయ్యబోయే NTR30 సెప్టెంబర్ రెండో వారం నుండి మొదలు అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. NTR30 కి ముహూర్తము పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.

అది కూడా దసరా స్పెషల్ గా NTR30 ని అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి వెంటనే రెగ్యులర్ షూట్ కి వెళ్లాలనే ఆలోచనలో ఎన్టీఆర్-కొరటాల ఉన్నారట. కొరటాల మూవీ మొదలు పెట్టి తర్వాత బుచ్చి బాబు మూవీ ని కూడా ఎన్టీఆర్ స్టార్ట్ చేయబోతున్నారట. కొరటాల - బుచ్చి బాబు సినిమాలని పారలల్ గా చేస్తారని, అందుకే బుచ్చి బాబు స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడంటున్నారు. అంటే ఈ దసరా వరకు ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చెయ్యాల్సిందే. మరోపక్క ఎన్టీఆర్ కి హీరోయిన్ గా NTR30 లో కియారా ని ఫైనల్ చేసే యోచనలోనే NTR30 టీం ఉందట.

NTR 30 opening soon:

NTR30 update 

Tags:   NTR30, KORATALA, NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ