బిగ్ బాస్ సీజన్1 మొదలైనప్పుడు కొద్దిగా పేరున్న సెలబ్రిటీస్ నే తీసుకువచ్చారు. తర్వాత సీజన్ కి పర్లేదు. కానీ మూడో సీజన్ నుండి సామాన్యులు, అలాగే యూట్యూబ్ లో ఫెమస్ అయిన ఆర్టిస్ట్ లని తీసుకునివస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఓటిటిలో అయితే చాలామంది ఫేస్ లు ఆడియన్స్ కి తెలియవు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్6 కోసం కూడా సామాన్యులకి ఎంట్రీ ఉండబోతున్నట్టుగా చెప్పారు. రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ 6 లోగో చూపిస్తూ కమింగ్ సూన్ అనే వీడియో వదిలారు. అంటే సెప్టెంబర్ మొదటి వారం నుండే బిగ్ బాస్ సీజన్ 6 మొదలు కాబోతుంది. ఇప్పుడు సీజన్ 6 లోకి వెళ్లబోయే వాళ్ళ పేర్లు చాలానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే యాంకర్ ఉదయభానుని బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించగా ఆమె నో చెప్పింది అన్నారు. బిగ్ బాస్ లో సీజన్ 4 కి జబర్దస్త్ నుండి అవినాష్ వచ్చాడు. అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో బాగా ఎంటర్టైన్ చేసాడు. ఈసారి కూడా బిగ్ బాస్ యాజమాన్యం జబర్దస్త్ పైనే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. జబర్దస్త్ లో కామెడీ చేసే ట్రాన్స్‌జెండర్ తన్మయి బిగ్ బాస్ 6 హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్స్ వారీగా ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, తమన్నాలు లు హౌస్ లో హడావిడి చేసారు. ఇప్పుడు తన్మయి ని తీసుకువచ్చే ప్లాన్ లో యాజమాన్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే నిజమైతే తన్మయి జబర్దస్త్ నుండి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్టే.