పెళ్లి చేసుకుని మూడు నెలలు తిరిగేలోపే భర్త రణబీర్ కపూర్ కి గుడ్ న్యూస్ చెప్పి అందరికి షాకిచ్చిన అలియా భట్.. ప్రేమ, పెళ్లి, పిల్లల విషయంలో ఎప్పుడూ సంచలనమే. పెళ్ళికి ముందు ప్రేమ విషయాన్ని ఎక్కడా అఫీషియల్ గా చెప్పని ఈ జంట పెళ్లి విషయాన్ని గుట్టుగానే దాచేసింది. పెళ్లి జరిగే వరకు అఫీషియల్ ప్రకటన లేకుండా హడావిడి లేకుండానే సింపుల్ గా వివాహం చేసుకుంది ఈ జంట. కానీ అలియా భట్ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని రణబీర్ కపూర్ అధికారికంగా సోషల్ మీడియా లో షేర్ చేసి ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అలియా భట్ సినిమా షూటింగ్స్ లో పాల్గొనడమే కాదు.. డార్లింగ్ ప్రమోషన్స్ లోను చురుగ్గా పాల్గొంది, తనపై వచ్చే ట్రోల్స్ కి ధీటుగా రిప్లై ఇచ్చే అలియా భట్ ని ప్రెగ్నెంట్ గా ఉండి.. పని చెయ్యడం రిస్క్ అనిపించడం లేదా అంటే.. లేదు వర్క్ చేస్తుంటే హుషారుగా ఉంటుంది.
వర్క్ మీద డెడికేషన్ ఉంటే ఎలాంటి ప్రోబ్లెంస్ ఉండవు అంటూ చెప్పిన అలియా భట్ గత కొన్ని రోజులుగా బేబీ బంప్ ని దాచేసే విషయంలో పలు రకాల డ్రెస్సులతో కనిపిస్తూ వచ్చింది. కానీ బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో అలియా భట్ తన బేబీ బంప్ ని బయట పెట్టేసే అవుట్ ఫిట్ తో కనిపించింది. రణబీర్ కపూర్, బ్రహ్మాస్త్ర దర్శకుడు ఆయన్ ముఖర్జీ తో కలిసి బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న అలియా భట్ బేబీ బంప్ ఎక్సపోజ్ చేసే డ్రెస్ వేసుకుని కనిపించేసరికి ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ చేతులకి పని చెప్పారు. దానితో అలియా భట్ బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.