ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే సినిమాలు వస్తే.. ఆకట్టుకునే కంటెంట్ ఉంటే.. థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయని ఈ రోజు శుక్రవారం రిలీజ్ అయిన బింబిసార, సీతారామం రెండు సినిమాలు నిరూపించాయి. మళ్ళీ తెలుగు చిత్ర పరిశ్రమకి కొత్త ఊపిరినిచ్చాయి. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార థియేటర్స్ మార్నింగ్ షో టాక్ తో ఒక్కసారిగా పుంజుకుని.. మ్యాట్నీ నుండి థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డు లే కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బాగా నిస్సారంగా గడిచిన జులై నీరసాన్ని మిగిల్చితే.. ఆగస్టు మాత్రం అద్భుతమైన ఆరంభంతో మొదలయ్యింది.
కళ్యాణ్ రామ్ - వశిష్ట కలయికలో తెరకెక్కిన పిరియాడికల్ మూవీ బింబిసార కి ఆడియన్స్ నుండే కాదు, క్రిటిక్స్ నుండి కూడా పాస్ మార్కులు పడిపోయాయి. దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం కి క్రిటిక్స్ సైడ్ నుండి ఎపిక్ లవ్ స్టోరీ, దృశ్య కావ్యం, రొమాంటిక్ చార్మ్, రాముడు.. సీతా అని పిలిచినంత హాయిగా వుండే సినిమా, క్లాసిక్ రొమాంటిక్ స్టోరీ, పొయెటిక్ లవ్ స్టోరీ అంటూ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. ప్రముఖుల నుండి ప్రశంశలు దక్కుతున్నాయి. సో ఈ వారం రిలీజ్ అయిన రెండు సినిమాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడం లో పక్కాగా సక్సెస్ అయ్యాయి. అటు పరిశ్రమకి ఊపిరినివ్వడమే కాదు, ఇటు బాక్సాఫీస్ కి ఊపునిచ్చాయి.