Advertisementt

డీజే వాయిస్తా అంటున్న చైతు

Fri 05th Aug 2022 08:34 PM
naga chaitanya,dj tillu,vimal krishna  డీజే వాయిస్తా అంటున్న చైతు
Chaitu teaming with DJ Tillu director? డీజే వాయిస్తా అంటున్న చైతు
Advertisement
Ads by CJ

నాగ చైతన్య ఖాతాలో రీసెంట్ గా థాంక్యూ మూవీ డిసాస్టర్ పడింది. నాగ చైతన్య కి మనం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శహకుడు విక్రమ్ కుమార్ చైతూ కి థాంక్యూ తో దిమ్మతిరిగే షాకిచ్చాడు. థాంక్యూ సినిమా తర్వాత నాగ చైతన్య మళ్ళీ చాలా తొందరగా హిందీ సినిమా లాల్ సింగ్ చద్దా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లాల్ సింగ్ లో చైతు చేసింది చిన్న పాత్రే అయినా.. చైతూ మాత్రం హిందీ నుండి తెలుగు వరకు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అలాగే చైతూ చేతిలో తెలుగు, తమిళ బై లింగువల్ మూవీ తో పాటుగా దూత వెబ్ సీరీస్ కూడా ఉంది.

ఇప్పుడు చైతూ డీజే వాయిస్తానంటున్నాడట. డీజే టిల్లు తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన దర్శకుడు విమల్‌ కృష్ణతో నాగ చైతన్య నెక్ట్స్‌ మూవీ చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. అటు డీజే టిల్లు సీక్వెల్ నుండి విమల్ కృష్ణ ని తప్పించారని, దానితో విమల్ కృష్ణ చైతు తో ప్రాజెక్ట్ ఓకె చేయించుకున్నారని అంటున్నారు. నాగ చైతన్య తమిళ దర్శకుడితో చెయ్యబోయే సినిమా ఫినిష్ కాగానే విమల్ కృష్ణ తో మూవీ పట్టాలెక్కవచ్చు అని తెలుస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు సమాచారం

Chaitu teaming with DJ Tillu director?:

Chaitu teaming with a Vimal Krishna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ