దిల్ రాజు గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సమస్యలపై నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్ తో చర్చలు జరుపుతూ హడావిడిగా ఉంటున్నారు. తాజాగా ఆయన మా ప్రస్తుత అధ్యక్షుడు మంచు విష్ణు తో భేటీ అయ్యారు. ఆయన నిర్మించిన థాంక్యూ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయితే దిల్ రాజు మొదటి భార్య అనిత హార్ట్ ఎటాక్ తో చనిపోగా.. ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. తన రెండో భార్య తేజస్విని ఈమధ్యనే పండంటి మగ పిల్లాడికి జన్మనిచ్చింది. దానితో దిల్ రాజు ఇంటికి వారసుడు వచ్చాడు.
ఆయనకు అంతకుముందు అమ్మాయి ఉంది. ఆమెకి పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ గానే తండ్రి అయిన దిల్ రాజు తన కొడుకు తో మొదటిసారి తిరుమల లో కనిపించారు. భార్య తేజస్విని, కొడుకుతో కలిసి దిల్ రాజు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దిల్ రాజు శ్రీవారి దర్శనానంతరం తన కొడుకుని ఎత్తుకుని బయటికి వచ్చేటప్పుడు ఆయన పై మీడియా ఫోకస్ పెట్టింది.. భార్య తో మట్లాడుతూ కొడుకుని ఎత్తుకున్న దిల్ రాజు మీడియా తో మాట్లాడకుండానే వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయారు.