సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట హిట్ తర్వాత రెండుసార్లు వెకేషన్స్ కి వెళ్లారు. ముందుగా అమెరికా, యూరప్ దేశాలను ఫ్యామిలీ తో కలిసి చుట్టేసిన మహేష్ బాబు మళ్ళీ హైదరాబాద్ లో కొన్ని రోజులు గడిపిన తర్వాత మరోసారి ట్రిప్ కి వెళ్లారు. సితార బర్త్ డే అవ్వగానే మహేష్ బాబు భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలసి స్విజ్జర్లాండ్ వెళ్లారు. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసిన మహేష్ బాబు తన లుక్ మార్చేసారు. ఎప్పుడూ నీట్ గా క్లీన్ గా షేవింగ్ చేసుకుని ఉండే మహేష్ చిన్నగా గెడ్డం పెంచి హెయిర్ స్టయిల్ పెంచారు.
రీసెంట్ గా నమ్రత మహేష్ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. మహేష్ ఫాన్స్ మహేష్ కొత్త లుక్ చూసి తెగ సర్ ప్రైజ్ అయ్యారు. అయితే స్విస్ ట్రిప్ లో భార్య పిల్లలతో ఎంజాయ్ చేసిన మహేష్ బాబు ఈ రోజు శుక్రవారం హైదరాబాద్ కి వచ్చేసారు. స్విస్ ట్రిప్ ముగించుకుని వచ్చిన మహేష్ అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మెరిసింది. మహేష్ మాస్క్ వేసుకున్నప్పటికీ.. ఆయన గెడ్డం కనిపిస్తుంది. సితార, నమ్రత, గౌతమ్ అందరూ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తున్న పిక్స్ వైరల్ గా మారాయి.