Advertisementt

RC15 ని పక్కన పెట్టిన శంకర్

Fri 05th Aug 2022 11:41 AM
kamal haasan,shankar,indian 2,rc 15,ram charan,august  RC15 ని పక్కన పెట్టిన శంకర్
Director Shankar ready for Indian 2 RC15 ని పక్కన పెట్టిన శంకర్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - శంకర్ కలయికలో RC15 షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. ట్రిపుల్ ఆర్ విడుదలకు ముందే రామ్ చరణ్ శంకర్ తో సెట్స్ మీదకి వెళ్ళిపోయాడు. అమృత సర్, వైజాగ్, హైదరాబాద్ లలో RC15 షూటింగ్ చేసిన శంకర్ అండ్ టీం.. ఇప్పుడు కూడా హైదరాబాద్ లోనే కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు. కానీ టాలీవుడ్ లో షూటింగ్ బంద్ కారణంగా శంకర్ - రామ్ చరణ్ లు కూడా RC షూటింగ్ ఆపేసారు. శంకర్ కూడా చెన్నై వెళ్లిపోయారు.

అయితే ప్రస్తుతం RC15 షూటింగ్ ఆగడంతో శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. చరణ్ మూవీ, కమల్ మూవీని రెండిటిని శంకర్ హ్యాండిల్ చెయ్యాలని డిసైడ్ అయ్యారట. కాకపోయితే ఇప్పుడు RC15 షూటింగ్ ఆగడం శంకర్ కి కలిసొచ్చింది. అందుకే ఇమ్మిడియట్ గా శంకర్ కమల్ తో ఇండియన్ 2 మొదలు పెట్టెయ్యబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎప్పుడో రెండేళ్ల క్రితమే ఆగిన ఇండియన్ 2 షూటింగ్ ఇప్పుడు పట్టాలెక్కడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఇక హీరోయిన్ కాజల్ కూడా సెప్టెంబర్ నుండి ఇండియన్ 2  సెట్స్ లోకి వెళ్ళబోతున్నట్లుగా చెప్పింది.

Director Shankar ready for Indian 2:

Kamal Haasan and Shankar Indian 2 to resume in August

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ