Advertisementt

బిగ్ బాస్ సీజన్ 6 అప్ డేట్ వచ్చేసింది

Thu 04th Aug 2022 08:53 PM
bigg boss 6,bigg boss,bigg boss telugu,nagarjuna  బిగ్ బాస్ సీజన్ 6 అప్ డేట్ వచ్చేసింది
Bigg Boss 6 coming soon బిగ్ బాస్ సీజన్ 6 అప్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్స్ ని బుల్లితెర ప్రేజేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో అంతకు మించి అనేలా బిగ్ బాస్ యాజమాన్యం ప్రతి ఏడాది బిగ్ బాస్ ని ప్లాన్ చేస్తూ వస్తుంది. ఈ ఏడాది బిగ్ బాస్ ఓటిటి ముగిసిన మూడు నెలలకే మళ్ళీ సీజన్ సిక్స్ ని రెడీ చేసేస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసి గోప్యంగా ఉంచారని తెలుస్తుంది. గత నెలలోనే నాగార్జున బిగ్ బాస్ సీజన్ సిక్స్ కోసం ప్రోమో షూట్ కూడా చేసారు. బిగ్ బాస్ హౌస్ కూడా రెడీ చేసేసారు.

ఇప్పుడు స్టార్ మా నుండి బిగ్ బాస్ లవర్స్ కి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. స్టార్ మా లో అతి త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ అంటూ బిగ్ బాస్ లోగో తో ఉన్న వీడియో ని వదిలింది స్టార్ మా. దానితో బుల్లితెర ప్రేక్షకులు చాలా థ్రిల్ ఫీలవుతున్నారు. ఈ సీజన్ లో రాబోయే కంటెస్టెంట్స్ ఎవరో అనే క్యూరియాసిటీ మరింతగా పెంచేలా ఆ వీడియో ఉంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి అడుగుపెట్టబోయే వారి పేర్లు చాలానే వినిపిస్తున్నాయి. అందులో సామాన్య కంటెస్టెంట్స్ ఎవరో, సెలెబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరో అనేది ఓపెనింగ్ డే రోజున తేలిపోతుంది. 

Bigg Boss 6 coming soon:

Bigg Boss 6 latest update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ