టాలీవుడ్ లో షూటింగ్స్ నిలిచిపోయి అప్పుడే నాలుగు రోజులు అవుతుంది. ఇండస్ట్రీ లో ఉన్న సమస్యల కారణంగా నిర్మాతలు కలిసికట్టుగా చిన్నా, పెద్ద సినిమాల షూటింగ్స్ అన్నీ ఆపేసారు. మరి సమస్యల పరిష్కారానికి చర్చలు అంటూ గత కొన్ని రోజులుగా నిర్మాతలు మీటింగ్ పెడుతున్నారు. నిన్న బుధవారం మా అసోసియేషన్ తో నిర్మాతల మండలి చర్చలు జరిపింది. నిర్మాతలు పదే పదే సమావేశమవుతున్నా సమస్యలు పరిష్కారం పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనేది ఓ కొలిక్కి రావడం లేదు.
తాజాగా ఓటిటి, విపిఎఫ్ చార్జీలు, వెజేస్ మరియు ధియేటర్ ల సమస్య ల పరిష్కారానికి నాలుగు కమిటి లను ఏర్పాటు చేసినట్లు ఫిలిం ఛాంబర్ మరియు నిర్మాతల మండలి తెలిపింది. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ తో కలిసి అన్నీ సమస్యలపై చర్చిస్తున్నామని తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని నిర్మాత దిల్ రాజు తెలిపారు. టాలీవుడ్ లో ప్రస్తుతం అన్నీ సినిమాల చిత్రీకరణలు ఆగాయని, త్వరలోనే సమస్యలను పరిష్కరించి, షూటింగ్ లను ప్రారంభిస్తామని దిల్ రాజు చెబుతున్నారు. అటు చూస్తే భారీ బడ్జెట్ చిత్రాలన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అలాగే షూటింగ్ చివరి దశలో ఉన్న గాడ్ ఫాదర్, ఘోస్ట్ లాంటి చిత్రాలకు ఈ షూటింగ్ బంద్ ఇబ్బంది గానే మారింది.
ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్, పవన్ హరిహర వీరమల్లు, రామ్ చరణ్ RC15 ఇలా ప్రతి ఒక్క సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో టాలీవుడ్ కామ్ గా కనిపించినా నిర్మాతలు మాత్రం రోజు ఏదో ఒక చర్చ అంటూ మీట్ అవుతూనే ఉన్నారు. కానీ ప్రోగ్రెస్ మాత్రం కనిపించడం లేదు.