Advertisementt

ప్రభాస్ లాంటి స్టారే వేడుకుంటున్నాడు

Thu 04th Aug 2022 11:58 AM
prabhas,sita ramam event,theaters,ott  ప్రభాస్ లాంటి స్టారే వేడుకుంటున్నాడు
Prabhas says Theater is Temple and OTT is Pooja Room ప్రభాస్ లాంటి స్టారే వేడుకుంటున్నాడు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సినిమాలకు బాడ్ టైం నడుస్తుంది అనే చెప్పాలి. కరోనా టైం లో ఒక విధంగా నష్టపోయిన నిర్మాత.. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్స్ కి రాని కారణంగా నష్టపోతున్నారు. సినిమా ప్లాప్ అయ్యి ఆడియన్స్ రాకపోతే అది వేరే విషం. కానీ స్టార్ హీరోల సినిమాలకి ఓపెనింగ్స్ దక్కడం లేదు. ఆచార్య సినిమా లో చిరు - చరణ్ కలిసి నటించినా ఓపెనింగ్స్ రాలేదు. ప్లాప్ అయ్యాక జనాలు లేకపోవడం వేరు, ఓపెనింగ్స్ పడకపోవడం చాలా ఘోరం. కారణం పెరిగిన టికెట్ ధరలు, కరోనా టైం.. బడ్జెట్ పెరిగిపోవడం ఇలాంటి సమస్యలు, ఫ్యామిలీతో సినిమా చూడాలంటే 2 నుండి 3 వేల ఖర్చు. అందుకే ఆ సినిమా ఓటిటిలోను వచ్చేస్తుంది అనే ధీమాతో ఆడియన్స్ థియేటర్స్ వైపు రావడం తగ్గించుకున్నారు. దానితో స్టార్ హీరోల సినిమాలకు కలెక్షన్స్ రావడం లేదు. తెలుగు మాత్రమే కాదు, హిందీలోనూ అదే పరిస్థితి.

అందుకే ప్రతి ఒక్క హీరో తమ సినిమాల రిలీజ్ టైం లో ప్రెస్ మీట్ పెట్టి మరీ టికెట్ ధరలు ఆడియన్స్ కి అందుబాటులో అంటూ ప్రకటించాల్సి వస్తుంది. థియేటర్స్ కి రండి అని మొత్తుకోవాల్సి వస్తుంది. ఎప్పుడూ పబ్లిక్ ఈవెంట్స్ కి రాని ప్రభాస్ కూడా రీసెంట్ గా సీత రామం ఈవెంట్ కి గెస్ట్ గా రావడమే కాదు, కొన్ని సినిమాలు థియేటర్స్ లోనే చూడాలి, ఇంట్లో పూజ చేశామని గుడికి వెళ్లడం మానం కదా.. మాకు సినిమా గుడి వంటిది అంటూ చెప్పాల్సిన పరిస్థితిలో సినిమా ఇండస్ట్రీ ఉంది. అంటే థియేటర్ గుడి, ఓటిటి అంటే పూజ రూమ్ అని ప్రభాస్ చెప్పినదానికి అర్ధం. తారక్, చరణ్, ప్రభాస్, మహేష్, పవన్, చిరు, బాలయ్య ఇలా అందరూ ఆడియన్స్ ని వేసుకోవాల్సి వస్తుంది.

Prabhas says Theater is Temple and OTT is Pooja Room:

Prabhas Joins Sita Ramam Pre-Release Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ