అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన క్రేజ్ పుష్ప తో మరింతగా పెరిగిపోయింది. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ స్టయిల్ కి యూత్ ఫిదా. పుష్ప మూవీ హిట్ అవడంతో అల్లు అర్జున్ చేతికి బోలెడన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశాలు వస్తున్నాయి. పుష్ప పార్ట్ 2 షూటింగ్ పక్కనబెట్టేసి మరీ బన్నీ బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్స్ షూట్ చేసుకుంటూ బిజీగా వున్నాడు. వారం క్రితం త్రివిక్రమ్ తో కమర్షియల్ యాడ్ చేసిన బన్నీ, హరీష్ శంకర్ తో మరో యాడ్ చేసాడు. హరీష్ శంకర్ తో చేసిన పైప్స్ యాడ్ లో అల్లు అర్జున్ లుక్ ఫాన్స్ కే కాదు, అందరికి తెగ నచ్చేసింది. ఆ రెండు యాడ్స్ ని బ్యాక్ టు బ్యాక్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు మరోసారి సుక్కుతో సెట్స్ మీదకి వెళ్ళాడు.
సుకుమార్ తో బన్నీ సెట్స్ మీదకి వెళ్లడం అంటే పుష్ప ద రూల్ షూట్ కోసమే అనుకునేరు. కానీ బన్నీ - సుక్కు చేసేది పుష్ప షూట్ కాదు, ఓ యాడ్ కోసం వీరు కలిసి షూటింగ్ చేయ్యబోతున్నట్లుగా పిక్స్ ని సోషల్ మీడియాలో వదిలారు. టాప్ కెమెరామెన్ రత్నవేలు, సుకుమార్, బన్నీ కలిసి ఈ యాడ్ షూట్ లో పాల్గొంటున్నారు. అయితే ఆర్య కోసం పని చేసిన సుకుమార్, అల్లు అర్జున్, రత్నవేలు.. మళ్ళీ ఇన్నాళ్ళకి అంటే 18 ఏళ్ళ తర్వాత వర్క్ చెయ్యబోతున్నట్టుగా రత్నవేలు.. బన్నీ-సుక్కు తో దిగిన సెల్ఫీలని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇక ఈ యాడ్ షూట్ లో బన్నీ స్టైలిష్ అవతార్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.