సౌత్ నుండి వస్తున్న పాన్ ఇండియా ఫిలిమ్స్ అన్ని భాషల్లో సత్తా చాటటమే కాదు, నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తుండడంతో.. ఒకప్పుడు ఇండియన్ సినిమాగా వెలుగొందిన బాలీవుడ్ ఇండస్ట్రీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లవడం కాదు, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ సౌత్ సినిమాలతో హిందీ సినిమాలని పోల్చడం మొదలు పెట్టడంతో.. అక్కడ ప్లాప్ వచ్చిన ప్రతిసారి సౌత్ సినిమాల్ని పోగుతుండడంతో.. సౌత్ vs హిందీ లా మారిపోయింది పరిస్థితి. అందుకే ప్రతి ఒక్క బాలీవుడ్ స్టార్ హిందీ సినిమాని డిఫెండ్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నారు. ఈమధ్యన హిందీ సినిమాలు ఆడడం లేదని ఎవరన్నారు అంటూ కరణ్ జోహార్ ఫైర్ అవడమే కాదు, హిందీలో రాబోయే సినిమాలపై ఆశలు పెట్టుకోవాలన్నారు ఆయన.
తాజాగా అలియా భట్ కూడా తన సినిమా డార్లింగ్ ప్రమోషన్స్ లో సౌత్ సినిమాలపై కామెంట్స్ చేసింది. ఇండియన్ సినిమాకి ఇది చాలా కష్టకాలం. ఇలాంటి టైం లో బాలీవుడ్ పై మనం ప్రేమ చూపించాలి. మనం ఇక్కడ కూర్చుని ఆహా బాలీవుడ్, ఓహో బాలీవుడ్ అని చెప్పుకుంటున్నాం, బాలీవుడ్ లో హిట్ అయిన సినిమాల్ని మనం పట్టించుకుంటున్నామా.. సౌత్ నుండి వచ్చే ప్రతి సినిమా హిట్ అవడం లేదు. కంటెంట్ బావుంటే ఏ సినిమా అయినా హిట్టే. కంటెంట్ వీక్ గా ఉంటే ఎక్కడైనా ప్లాప్ తప్పదు అని చెప్పిన అలియా భట్ ప్రెగ్నెన్సీ టైం లోను తాను ప్రమోషన్స్ లో పాల్గొనడం పై కూడా స్పందించింది.
హెల్దీ గా ఆక్టివ్ గా ఉంటే.. వర్క్ నుండి బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, చాలామంది అడుగుతున్నారు. ఇలాంటి టైం లో పని చెయ్యడం ఇబ్బందిగా లేదా అని. నాకెలాంటి ప్రాబ్లెమ్ లేదు. పని పట్ల ఉన్న ప్రేమ, నా వృత్తి పట్ల ఉన్ననిజాయితీతోనే నేను హ్యాపీ గా పని చేసుకోగలుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.