యంగ్ హీరో రామ్ పోతినేని ద వారియర్ మూవీ ఇచ్చిన షాక్ నుండి తేరుకుని బోయపాటి తో చెయ్యబోయే ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో రామ్ ని మాస్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడట బోయపాటి. బోయపాటి సినిమాలో రామ్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడని ఎప్పటినుండో ప్రచారం లో ఉన్న న్యూస్. అయితే తాజాగా RAPO20 లో రామ్ దోపిడీ దొంగగా కనిపించబోతున్నాడని అంటున్నారు.
ఈ కథ ఒక భారీ దోపిడీ నేపథ్యంలో నడుస్తుందని, ఇద్దరు రామ్ లలో ఒకరు దొంగగా కనిపించనున్నారని అంటున్నారు. వారియర్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన రామ్.. దొంగగా ఎలాంటి మేకోవర్ లో కనిపిస్తాడో అనేది ఇప్పుడు రామ్ ఫాన్స్ లో ఉన్న క్యూరియాసిటీ. అఖండ తర్వాత బోయపాటి నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రామ్ కూడా గత చిత్రాల విషయాలు పక్కనబెట్టి ఈ సినిమా కోసం ఎనర్జీ లెవెల్స్ పెంచడమే కాకుండా జిమ్ లో వర్కౌట్స్ తో గడిపేస్తున్నాడని అంటున్నారు. రామ్ కి జోడిగా పాన్ ఇండియా క్రేజ్ ఉన్న రష్మిక అయితే బావుంటుంది అని బోయపాటి ఆలోచన గా తెలుస్తుంది.